
ఎయిర్ పోర్టును తలపించేలా భాగ్యనగరంలో నిర్మించిన చర్లపల్లి రైల్వేస్టేషన్ (Cherlapally Railway Station) ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ స్టేషన్ అందుబాటులోకి వస్తే.. ప్రజెంట్ నగరంలో ఉన్న నాంపల్లి(Nampally), సికింద్రాబాద్(Secunderabad), కాచిగూడ స్టేషన్ల(Kachiguda stations)లో రద్దీ భారం తగ్గనుంది.
సుదూర ప్రాంతాలకు సులభంగా
హైదరాబాద్(HYD)కు తూర్పు భాగంలో చర్లపల్లి టెర్మినల్ ఉండటం.. దీనికి దగ్గర్లోనే ఘట్‌కేసర్(Ghatkesar) వద్ద ఔటర్ రింగ్ రోడ్ (ORR) కూడా ఉండటంతో ప్రయాణికులు సుదూర ప్రాంతాలకు సులభంగా ప్రయాణించ గలుగుతారని అధికారులు అంటున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్(Traffic) ఇబ్బందులు లేకుండా చర్లపల్లి టెర్మినల్‌కు చేరుకునే వెసులుబాటు ఉంటుందని అంటున్నారు.
ప్రారంభం ఆ రోజునే
తాజాగా చర్లపల్లి రైల్వే టెర్మినల్(Charlapally Railway Terminal)కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఈనెల 28న దీనిని ఆవిష్కరించనున్నారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnav)తో పాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy)తో కలిసి ప్రారంభించనున్నారు. దాదాపు రూ.430 కోట్ల వ్యయంతో రైల్వేశాఖ(Department of Railways) అభివృద్ధి చేసింది. ఈ స్టేషన్‌లో 6 ఎస్కలేటర్లు, 7 లిఫ్ట్‌లు, 6 బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. మహిళలకు, పురుషులకు వేర్వేరు వెయిటింగ్ హాల్స్(Waiting halls), హైక్లాస్ వెయిటింగ్ ఏరియా, గ్రౌండ్ ఫ్లోర్‌లో ఎగ్జిక్యూటివ్ లాంజ్‌ని నిర్మించారు. టెర్మినల్ తొలి అంతస్తులో కెఫ్ టేరియా, రెస్టారెంట్, రెస్ట్ రూమ్ తదితర సౌకర్యాలను కల్పించారు. ప్రయాణికులకు ఉచిత వైఫై(Free WiFi) సదుపాయం అందుబాటులో ఉంటుంది.