గత కొంతకాలంగా తెలుగురాష్ట్రంలో హల్చల్ చేస్తున్న అఘోరీ నాగసాధు(Aghori Nagasadhu) పోలీసులు నిన్న అరెస్టు(Arrest) చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేక పూజల(Special Pooja) పేరుతో ఓ మహిళ నుంచి రూ.10 లక్షలు తీసుకొని మోసం చేసిందన్న ఆరోపణలతో ఆమెను ఉత్తరప్రదేశ్(UP)లో అరెస్టు చేశారు. ఇవాళ తెలంగాణకు తీసుకొచ్చిన పోలీసులు దాదాపు రెండు గంటల పాటు విచారించి చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి(Chevella Govt Hospital)లో వైద్య పరీక్షలు చేపించారు. అనంతరం చేవెళ్ల కోర్టు(Chevella Court)లో హాజరుపర్చారు. బాధితురాలి ఫిర్యాదు, ఆమె అఘోరీకి పంపిన నగదు లావాదేవీల(Cash ransactions)ను పరిశీలించిన కోర్టు అఘోరీకి 14 రోజుల రిమాండ్(Remand) విధించింది.
#Aghori arrest by mokila police#Aghorinagasadhu#Aghoriarrest pic.twitter.com/bzm4x4zOJq
— SHRA.1 JOURNALIST✍ (@shravanreporter) April 23, 2025
రూ.10 లక్షలు తీసుకుని మోసం చేశారని ఆరోపణలు
వివరాల్లోకి వెళితే, ఓ మహిళ తన సమస్యల పరిష్కారం కోసం అఘోరీని ఆశ్రయించారు. ప్రత్యేక పూజలు చేస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్మించిన అఘోరీ, సదరు మహిళ నుంచి దశలవారీగా సుమారు రూ.10 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. అయితే, ఎంతకాలమైనా తన సమస్యలు తీరకపోవడం, అఘోరీ ప్రవర్తనపై అనుమానం రావడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.
పోలీసుల దర్యాప్తునకు సహకరిస్తా: అఘోరీ
మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు, అఘోరీని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను చేవెళ్ల కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ప్రాథమిక ఆధారాలు(Basic evidence), వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, అఘోరీకి రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో అఘోరీని సంగారెడ్డి సబ్ జైలు(Sangareddy Sub Jail)కు తరలించారు. ఈ సందర్భంగా అఘోరీ మాట్లాడుతూ, తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉందని, తాను పోలీసుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని తెలిపింది. కాగా, అఘోరీ ఇటీవల వర్షిణి(Varshini) అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.








