గతకొంత కాలంగా సోషల్ మీడియా(Social Media)లో మెగా ఫ్యాన్స్(Mega Fans), అల్లు అభిమానుల(Allu Fans) మధ్య తరచూ వార్ జరుగతుండటం చూస్తూనే ఉన్నాం. డీజే ఈవెంట్లో చెప్పను బ్రదర్‌తో మొదలైన ఈ రచ్చ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం(Pawan Kalyan’s election campaign) నుంచి Pushpa-2ని టార్గెట్ చేసుకునే దాకా వచ్చింది. దీంతో కొన్నేళ్లుగా ఉద్దేశపూర్వకంగానే బన్నీ ఎక్కడా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ప్రస్తావన తేవడం లేదని, తనకు ఎవరి మద్దతు అవసరం లేదనే తరహాలో ప్రవర్తిస్తున్నాడని మెగా ఫ్యాన్స్ ఫైరయ్యారు. కానీ అలాంటిదేమీ లేదు, సందర్భం వచ్చినప్పుడు మావయ్య మీద ప్రేమను ఐకాన్ స్టార్ ప్రదర్శిస్తూనే ఉంటాడని బన్నీ ఫ్యాన్స్ కౌంటర్ ఇచ్చేవారు. తాజాగా జరిగిన వేవ్స్ సమ్మిట్ (Waves Summit 2025)లో దీనికి బన్నీ చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు.
His inspiration and his love for his megastar @KChiruTweets 🥹❤️@alluarjun ❤️ pic.twitter.com/WylYf51rMd
— NithishBunny 🦚 (@nithishbunny48) May 1, 2025
ఆయన ప్రభావం నామీద చాలా ఉంది..
వేవ్స్ సమ్మిట్‌లో ఎదురైన ప్రశ్నకు బన్నీ(Bunny) సమాధానం ఇచ్చాడు. తనకు గొప్ప స్ఫూర్తి(Inspiration) ఇచ్చిన వాళ్లలో మావయ్య మెగాస్టార్ చిరంజీవి ఒకరని, ఆయన ప్రభావం నామీద చాలా బలంగా పని చేసిందని చెప్పుకొచ్చాడు. ఈ మాటలు చెబుతున్నప్పుడు సభికుల నుంచి చప్పట్లు వినిపించడం విశేషం. ఇప్పుడీ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. పుష్ప 2కి సంబంధించి సంధ్య థియేటర్ దుర్ఘటన(Sandya Theatre Incident) జరిగినప్పుడు బన్నీ స్వయంగా చిరంజీవి ఇంటికి వెళ్లి జరిగిందంతా వివరించి ఫొటో తీసుకొచ్చాడు. తర్వాత మళ్లీ వీరు కలవలేదు. ఇప్పుడు వేవ్స్‌లో అల్లు అర్జున్ తానుగా చిరు గురించి గొప్పగా చెప్పడం గమనించాల్సిన విషయం. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీ కాంబోలో ఓ భారీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.






