
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి(Jagadekaveerudu Athiloka Sundari) మూవీ మళ్లీ ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఈ మూవీ రిలీజ్ అయి 35 ఏళ్లు అవుతున్న సందర్భంగా మే 9న రీరిలీజ్(Rerelease) చేస్తున్నారు. ఈ సందర్బంగా మూవీ గురించి అనేక విషయాలు వైరల్(Viral) అవుతున్నాయి. ఈ మూవీ గురించి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. 1990 మే 9న రిలీజ్ అయిన ఈ మూవీని.. అప్పట్లో రీల్ రూపంలోనే ప్రదర్శించారు. ఇప్పుడు టెక్నాలజీని బేస్ చేసుకుని 3డీ ప్రింట్(3D print) లోకి మూవీని మార్చేశారు. ఈ సినిమాలో దివంగత నటి శ్రీదేవి చిరుకి జోడీగా నటించిన విషయం తెలిసిందే.
చాలా కష్టపడి చేశారట..
తాజాగా మూవీ టీమ్ దీనిని ప్రకటించింది. చాలా కష్టపడి మరీ రీల్ రూపంలో ఉన్న మూవీని 3డీ ప్రింట్లోకి మార్చినట్టు మేకర్స్ తెలిపారు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేందుకు ఈ మూవీని సరికొత్త ఫుటేజ్‌లోకి మార్చామని సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. ఈ 2D అండ్ 3D ఫార్మాట్లలో వస్తున్న సినిమాను త్వరలోనే చిరంజీవి మళ్లీ ప్రమోట్ చేసే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే ఈ మూవీ గురించి చిరు ఓ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దీంతో వింటేజ్ చిరూని మరోసారి తెర మీద చూసేందుకు ఫ్యాన్స్ రెడీ అయిపోతున్నారు. కాగా ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.