TGSRTC: ప్రయాణికులకు రిలీఫ్.. ఆర్టీసీ కార్మికుల సమ్మె వాయిదా

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కార్మికులు తలపెట్టిన సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌(Ponnam Prabhakar)తో ఆర్టీసీ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (JAC) నేతలు జరిపిన చర్చలు సఫలం కావడంతో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. కార్మికుల డిమాండ్లు, సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, ఒక ఉన్నతస్థాయి కమిటీ(High level committee)ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే సమ్మె నిర్ణయం తాత్కాలిక వాయిదా మాత్రమేనని ఉద్యోగ సంఘాల నాయకులు(Leaders of trade unions) స్పష్టం చేశారు.

దీర్ఘకాలిక డిమాండ్ల సాధన కోసం

కాగా తమ దీర్ఘకాలిక డిమాండ్ల సాధన కోసం TGSRTC JAC నేతలు ఇటీవల సమ్మె(Strike)కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మే 6వ తేదీ అర్ధరాత్రి వరకు ప్రభుత్వం నుంచి చర్చలకు ఆహ్వానం అందకపోతే, మే 7వ తేదీ నుంచి సమ్మెకు దిగుతామని వారు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం నాడు కార్మికులు భారీ కవాతు నిర్వహించారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ప్రభుత్వం చొరవ తీసుకుని జేఏసీ నేతలను చర్చలకు ఆహ్వానించింది.

ముగ్గురు సీనియర్ IAS అధికారులతో..

మంత్రి పొన్నం ప్రభాకర్‌తో JAC నేతలు జరిపిన సమావేశంలో కార్మికుల సమస్యలు, డిమాండ్లపై చర్చించారు. ఈ సందర్భంగా, ఉద్యోగుల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కార మార్గాలను సూచించేందుకు ముగ్గురు సీనియర్ IAS అధికారులతో ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ కమిటీలో నవీన్ మిట్టల్, లోకేశ్ కుమార్, కృష్ణభాస్కర్ సభ్యులుగా వ్యవహరిస్తారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఈ కమిటీ చర్చలు జరిపి, వారం రోజుల్లోగా సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

Related Posts

Fish Venkat: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ (Fish Venkat) శుక్రవారం (జులై 18) రాత్రి కన్నుమూశారు. 53 ఏళ్ల ఆయన అసలు పేరు మంగిలంపల్లి వెంకటేశ్. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం(serious illness)తో…

IBPS PO 2025 Notification: డిగ్రీ అర్హతతో IBPSలో భారీ నోటిఫికేషన్.. 5,208 పోస్టులు భర్తీ! ఇలా అప్లై చేయండి!

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) మరియు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తాజాగా రెండు కీలక నోటిఫికేషన్ల( Notifications)ను విడుదల చేశాయి. బ్యాంకింగ్, ఇంజనీరింగ్ రంగాల్లో ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం. IBPS PO/MT…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *