
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 155 పైగా సినిమాల్లో నటించి ఇప్పటికీ అభిమానులను మెప్పిస్తున్నాడు. ఏజ్ పెరిగినా తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదంటూ యంగ్ హీరోస్‌కి గట్టి పోటీ ఇస్తున్నాడు. అయితే చిరు చివరగా నటించిన ‘భోళా శంకర్’(Bhola Shankar), ‘వాల్తేరు వీరయ్య’(Valtheru Veeraiah) మూవీలు బాక్సాఫీస్ వద్ద అనుకున్న మేర సక్సెస్ కాలేదు. దీంతో మరో బ్లాక్ బస్టర్ కల్ట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాడు మెగాస్టార్. ఈ నేపథ్యంలో ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’(Vishwambhara). తాజాగా ఈ మూవీ రిలీజ్ తేదీ ఫిక్స్ చేసినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి.
తొలుత పరిశీలనలో రెండు తేదీలు.. కానీ
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌కు సంబంధించిన ఓ న్యూస్ టీటౌన్‌లో వైరల్ అవుతోంది. సంక్రాంతి(Sankranti)కి రావాల్సిన ఈ మూవీ గేమ్ ఛేంజర్(Game Changer) కారణంగా వాయిదా పడింది. ఈ క్రమంలో రెండు రిలీజ్ డేట్స్‌ను పరిశీలిస్తున్నారని ఫిల్మ్ నగర్‌లో టాక్ వినిపిస్తోంది. అందులో ఒకటి మే 9, 2025. సమ్మర్ హాలిడేస్‌లో బాస్ ఎంట్రీ ఇచ్చి దుమ్ములేపబోతున్నాడని తెలుస్తోంది. మరొకటి చిరు బర్తే డే(Megasta Birthday) అయిన ఆగస్టు 22 అని తొలుత ప్రచారం జరిగింది. కానీ ‘ఇంద్ర’ లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రం వచ్చిన తేదీనే అంటే జులై 24నే ఈ మూవీ విడుదల చేయాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తోందట. సోషియో ఫాంటసీ అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా ముస్తాబవుతున్న ఈ చిత్రం చిరు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా నిలవనుంది.
మెగా అభిమానుల్లో భారీ అంచనాలు
డైరెక్టర్ వశిష్ఠ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో సినీయర్ స్టార్ హీరోయిన్ త్రిష(Trisha), యంగ్ బ్యూటీ ఆషికా రంగనాథ్(Ashika Ranganath) చిరుకు జోడీగా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం VFX పనులు సాగుతున్నాయి. దీంతో త్వరలోనే అన్ని పనులు పూర్తి చేసి థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 12వ తేదీన హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వంభర నుంచి పాటను విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.