మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘విశ్వంభర’(Vishvambhara)పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ లుక్, గ్లింప్స్ తోనే సినిమాపై అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. కానీ సినిమాకు సంబంధించి నిర్ధిష్టమైన విడుదల తేదీ ఇంకా ప్రకటించకపోవడం, సంక్రాంతి రిలీజ్ కుదరకపోవడంతో కొంత నిరాశ వ్యక్తమవుతోంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్(Mouni Rai) పై ఓ స్పెషల్ సాంగ్ షూట్(Special Song) చేసినట్లు తెలుస్తోంది. అది కూడా చిరంజీవి నటించిన హిట్ సాంగ్‌కి రీమిక్స్(Rimix) అని తెలుస్తోంది. మరి ఆ పాట ఏదంటే… 2000లో విడుదలైన ‘అన్నయ్య’(Annayya) సినిమాలోని “ఆట కావాలా.. పాట కావాలా…” పాట. అప్పట్లో సిమ్రన్ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చిన ఈ పాట ఓ సెన్సేషన్‌గా నిలిచింది. ఇప్పుడు అదే పాటను ‘విశ్వంభర’లో మళ్లీ రీమిక్స్ చేయడంతో పాటు, ఆ పాటలో చిరంజీవే మళ్లీ స్టెప్పులేస్తున్నారట.
ఈ రీమిక్స్‌కు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ కంపోజర్‌గా పని చేస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే చిత్రానికి సంగీతం అందిస్తున్న ఎం.ఎం.కీరవాణి ప్రస్తుతం ఇతర ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారట. అయితే, ఈ పాట రీమిక్స్‌తో చిరు ఎలా మెస్మరైజ్ చేస్తాడో చూడాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే. ‘విశ్వంభర’పై ఇప్పటికే ఉన్న హైప్‌కు ఈ స్పెషల్ సాంగ్ మరింత హంగు కలిపే అవకాశం ఉంది.






