ఎన్టీఆర్- త్రివిక్రమ్ సినిమాలో విలన్‌గా రానా దగ్గుబాటి..!

టాలీవుడ్‌లో ఓ క్రేజీ కాంబినేషన్‌పై ఫ్యాన్స్‌లో ఎనలేని ఉత్సాహం నెలకొంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas), యంగ్ టైగర్ ఎన్టీఆర్(Young Tiger NTR) కలిసి సినిమా చేయనున్న విషయం ఇప్పటికే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. కథ ఏమిటో స్పష్టంగా బయటకు రాలేదు కానీ ఇది ఒక పౌరాణిక సినిమా అనే సమాచారం బయటకు రావడంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుష్‌ అవుతున్నారు.

ఈ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్ కార్తికేయుడు పాత్రలో నటించనున్నారని సమాచారం. ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో ఎన్టీఆర్ చేతిలో “మురుగన్” పుస్తకం కనిపించిన వీడియో వైరల్ కావడం ఇందుకు బలంగా మారింది. సుబ్రమణ్య స్వామి కథ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది. మైథాలజీ జనరాలో త్రివిక్రమ్ తొలిసారి ప్రయత్నించబోతుండటంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

ఇంతలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాలో విలన్‌గా రానా దగ్గుబాటి(Rana Daggupati) నటించనున్నారట. గాడ్ ఆఫ్ వార్‌తో సంబంధం ఉన్న శక్తిమంతమైన స్వామి గెటప్‌లో రానా కనిపించనున్నట్లు తెలుస్తోంది. బాహుబలి, భీమ్లా నాయక్, వేట్టయాన్ వంటి చిత్రాల్లో తన పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్న రానా ఈ సినిమాలో అంతకంటే మిన్నగా కనిపించనున్నాడట.

ప్రస్తుతం ఎన్టీఆర్ ‘వార్ 2’తో పాటు ప్రశాంత్ నీల్ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌లు పూర్తైన తర్వాత త్రివిక్రమ్ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈసారి కథ, కాంబినేషన్, కాన్సెప్ట్ అన్నీ విభిన్నంగా ఉండటంతో ఫ్యాన్స్ అంచనాలు నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లిపోయాయి. ఇంకేముంది… ఈ కలయిక వెండితెరపై ఎలాంటి మాయ చేస్తుందో చూడాలి!

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *