Vishwabhara: మెగాస్టార్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. పవర్ స్టార్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్!

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘విశ్వంభర(Vishwabhara)’ రిలీజ్‌పై ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. బింబిసార ఫేమ్ వసిష్ఠ మల్లిడి(Vasista Mallidi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సోషియో-ఫాంటసీ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 25న థియేటర్లలోకి రానుందని సినీవర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇది పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న ‘ఓజీ(Original Gangster)’ చిత్రం కంటే ముందు విడుదల కానుందని టాక్. OG రిలీజ్‌లో ఆలస్యం జరిగే అవకాశం ఉండటంతో, విశ్వంభర టీమ్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఏడు ఎకరాల్లో 13 భారీ సెట్స్‌

చిరంజీవి సరసన త్రిష కృష్ణన్(Trisha Krishnan), కునాల్ కపూర్(Kunal Kapoor), ఆశికా రంగనాథ్(Ashika Ranganath) కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం UV క్రియేషన్స్ బ్యానర్‌పై వి. వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం, చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీతో ఈ చిత్రం భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్‌(Annapurna Studios)లో 7 ఎకరాల్లో 13 భారీ సెట్స్‌ నిర్మించి, ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించారు.

Trisha to start filming of 'Vishwambhara' soon

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు

ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తయింది, ఒక ఐటెం సాంగ్ తప్ప. కంప్యూటర్ గ్రాఫిక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఈ చిత్రం జగదేకవీరుడు అతిలోకసుందరి సీక్వెల్ కాదని, పూర్తిగా కొత్త కథతో రూపొందుతుందని దర్శకుడు వసిష్ఠ స్పష్టం చేశారు. సంక్రాంతి 2025 రిలీజ్‌కు ప్లాన్ చేసినప్పటికీ, సెప్టెంబర్‌లోనే విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. మెగా అభిమానుల్లో ఈ వార్త ఉత్సాహాన్ని నింపుతోంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *