బాలీవుడ్ టాప్ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) మరోసారి మాస్ అవతారమెత్తాడు. ఆయన తాజాగా నటిస్తున్న మూవీ ‘ధురంధర్’ (Dhurandhar).ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో 20 ఏళ్ల సారా అర్జున్ (Sara Arjun) హీరోయిన్గా పరిచయం అవుతోంది. సంజయ్ దత్ (Sanjay Dutt), మాధవన్ (R. Madhavan), అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ లాంటి పెద్ద యాక్టర్లు కీలక రోల్స్ పోషిస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర బృందం ఆదివారం ‘ఫస్ట్ లుక్’ పేరుతో టీజర్‌ను రిలీజ్ చేసింది. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా డిసెంబరు 5న డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఊర మాస్ అనిపిస్తున్న టీజర్ను మీరూ చూసేయండి.






