తనను వేధించాడని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై (Jani Master) ఓ లేడీ కొరియోగ్రఫర్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రముఖులు సైతం స్పందించారు. జానీ మాస్టర్‌ను (Choreographer Jani Master) అరెస్ట్ చేసిన పోలీసులు కొంతకాలం జైలులో ఉంచారు. ఆ తర్వాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలోనే డ్యాన్స్ యూనియన్ (Dance union) నుంచి జానీ మాస్టర్‌ను శాశ్వతంగా తొలగించారని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన స్పందించారు. అవన్నీ పుకార్లేనన్నారు.
ఆ హక్కు ఎవరికీ లేదు
‘నిర్ధారణ కాని ఆరోపణలను కారణంగా చూపిస్తూ నన్ను శాశ్వతంగా యూనియన్ నుంచి తొలగించినట్లు మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వాటిని నమ్మకండి. నా పదవీ కాలం ఇంకా ఉంది. అయితే అనధికారికంగా, అనైతికంగా ఎలక్షన్లు నిర్వహించి వారికి వారే నిర్ణయాలు, హోదాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదు. దీనికి కారణమైన వారిపై చట్టపరంగా పోరాటం చేస్తున్నా. త్వరలోనే వివరాలు చెబుతా. టాలెంట్ ఉన్నవారికి పని ఇవ్వకుండా, పని దొరక్కుండా ఎవరూ ఆపలేరు’ అని అన్నారు.
గేమ్ ఛేంజర్ నుంచి హుషారైన పాట
తాను కొరియోగ్రఫీ చేసిన రామ్‌చరణ్ (Ram charan) మూవీ ‘గేమ్ ఛేంజర్’ (Game changer)నుంచి ఓ మంచి పాట రానుందని తెలిపారు. అందరికీ ఆ పాట నచ్చుతుందని నమ్ముతున్నాని అన్నారు. యూనియన్‌కు నేను ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు. తన వద్ద వర్క్ చేసిన చాలామంది ఇప్పుడు కొరియోగ్రాఫర్లగా మారారని, ఇండస్ట్రీలో రాణిస్తున్నారని పేర్కొన్నారు.