RC16 మూవీ బ్యాక్ డ్రాప్ ఏంటో తెలిసిపోయిందోచ్..!

గ్లోబల్​ స్టార్ రామ్‌ చరణ్‌ (Ram Charan), ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన కాంబోలో ‘RC16’ వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ‘గేమ్ ఛేంజర్’ పరాజయం నుంచి కోలుకున్న చెర్రీ ఇటీవలే ఈ సినిమా షూటింగు సెట్ లో అడుగుపెట్టారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా గురించి ఇప్పుడు ఓ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది.

క్యాప్షన్ తో హింట్ 

ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ (RC16 Sports Backdrop) లో రానున్నట్లు గతంలో వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్న రత్నవేలు RC16 గురించి ఓ క్రేజీ అప్డేట్ ను నెట్టింట షేర్ చేశారు. సినిమా షూటింగ్ సెట్ ఫొటో షేర్ చేసిన రత్నవేలు (Ratnavelu).. “నైట్‌ షూట్‌, ఫ్లడ్‌ లైట్స్‌, క్రికెట్‌ పవర్‌, డిఫరెంట్‌ యాంగిల్స్‌” అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

చూసుకోవాలిగా బాసూ

ఇప్పుడు ఈ క్యాప్షన్ అందర్నీ ఆకర్షిస్తోంది. గతంలో పుకార్లు వచ్చినట్లుగానే చెర్రీ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లోనే ఉండబోతుందంటూ ఆయన తన పోస్టుతో క్లారిటీ ఇచ్చారని నెటిజన్లు అంటున్నారు. అయ్యో బ్యాక్ డ్రాప్ చెప్పేశారుగా.. చూసుకోవాలిగా బాసూ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఓ సీక్వెన్స్‌ కోసం నెగిటివ్‌ రీల్‌ వినియోగించున్నట్టు రత్నవేలు చెప్పుకొచ్చారు. రీసెంట్ బ్లాక్​బస్టర్ ‘దేవర (Devara)’ సినిమాకు కొంత మేర ఆ ప్రయత్నం చేశానని రత్నవేలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

కీలక పాత్రల్లో స్టార్ నటులు

రామ్ చరణ్, జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, శివ రాజ్‌కుమార్, దివ్యేందు వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మ్యూజిక్​ సెన్సేషన్, ఆస్కార్ విన్నర్​ ఏఆర్‌ రెహమాన్‌ (AR Rahaman) ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. స్టార్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు దీనికి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలతో కలిసి వెంకట సతీశ్‌ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *