సూర్య ‘రెట్రో’ తెలుగు టీజ‌ర్ ఔట్.. రిలీజ్ డేట్ ఫిక్స్

కోలీవుడ్ హీరో (Suriya) సూర్య తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తమిళంలో సినిమాలు చేస్తూ వాటిని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇటీవల కంగువా (Kanguva) సినిమాతో వచ్చి అట్టర్ ఫ్లాప్ మూటగట్టుకున్నారు. ఇక ఈ పరాజయం నుంచి బయటపడి తన నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ చేస్తున్నారు. ఈ క్రమంలో త‌మిళ ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraju)తో సూర్య ఓ సినిమా ప్లాన్ చేశారు.

రెట్రో తెలుగు టీజర్

పూజా హెగ్డే హీరోయిన్ (Pooja Hegde)గా నటిస్తున్న ఈ సినిమాకు ‘రెట్రో’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. గతంలోనే రెట్రో తమిళ్ టీజర్ ను రిలీజ్ చేసిన మేకర్స్.. ఇప్పుడు తెలుగు టీజర్ విడుదల చేశారు. ఈ టీజ‌ర్‌ (Retro Telugu Teaser) చూస్తుంటే గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో సూర్య తన విశ్వరూపం చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఓ గ్యాంగ్ స్టర్ ను అతడి ప్రేయసి ప్రేమికుడిగా ఎలా మార్చింది.. తన ప్రియురాలి కోసం హీరో ఏం చేశాడన్నదే ఈ సినిమా స్టోరీ అని టీజర్ చూస్తే అర్థమవుతోంది.

మే1న రెట్రో రిలీజ్

మ‌ల‌యాళ న‌టుడు జోజు జార్జ్, క‌రుణక‌ర‌ణ్, జ‌యరామ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా మేకర్స్ ఈ రెట్రో రిలీజ్ డేట్ ను ప్రకటించారు.  స‌మ్మ‌ర్ కానుక‌గా మే 1వ తేదీన (Retro Release Date) ఈ ప్రేక్ష‌కుల ముందుకు రానున్నట్లు తెలిపారు. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తన భార్య జ్యోతికతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ద‌స‌రా సినిమాకు సంగీతం అందించిన సంతోష్ నారాయ‌ణ‌న్ ఈ సినిమా మ్యూజిక్ అందిస్తున్నాడు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *