Mana Enadu : జస్టిస్ హేమ కమిటీ నివేదిక (Justice Hema Committee Report) బయటకు వచ్చిన తర్వాత మలయాళ చిత్ర పరిశ్రమలో రోజుకో సంచలనం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రేమమ్ నటుడు నివిన్ పౌలిపై ఓ యువ నటి ఫిర్యాదు చేసింది. తనను వేధింపులకు గురి చేశారంటూ నివిన్ పౌలి (Nivin Pauly)తో సహా ఆరుగురిపై నాన్-బెయిలబుల్ కేసు నమోదైంది.
నివిన్ పౌలికి క్లీన్ చిట్
ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన అధికారులు.. నివిన్ పౌలిపై నమోదైన కేసులో ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. నివిన్ పౌలి సదరు యువతి నటిని లైంగికంగా వేధించినట్లు (Nivin Pauly Sexual Harassment) స్పష్టమైన ఆధారాలు లభించలేదని తెలిపారు. బాధితురాలిపై లైంగిక వేధింపులు జరిగిన సమయంలో నివిన్ అక్కడ లేడని వెల్లడించారు.
ఈ మేరకు డీవైఎస్పీ నేతృత్వంలోని విచారణ బృందం కొత్తమంగళం కోర్టుకు సమర్పించింది. ఈ నిందితుల జాబితా నుంచి నివిన్ పౌలి పేరును తొలగించారు. అదే సమయంలో మిగిలిన వారిపై విచారణ కొనసాగుతుందని తెలిపారు. దీంతో ఆయనకు ఈ కేసులో క్లీన్ చిట్ ఇచ్చినట్లయింది.
తనకు సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి గత నవంబరులో ఆమెను దుబాయ్ తీసుకెళ్లి.. అక్కడే ఆమెను లైంగికంగా వేధించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో ఈ వ్యవహారంపై పోలీసులు ప్రాథమిక విచారణ జరిపారు. ఈ క్రమంలోనే నివిన్ పౌలీ సహా ఆరుగురిపై నాన్-బెయిలబుల్ కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఓ నిర్మాత కూడా ఉన్నాడు. జాబితాలో నివిన్ పౌలీని ఆరో వ్యక్తిగా చేర్చారు. నివిన్‌పై కేసు నమోదైన విషయం సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది.






