ఆంధ్రప్రదేశ్(AP)లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘స్త్రీ శక్తి(Stree Shakti)’ నేడు (ఆగస్టు 15) ఘనంగా ప్రారంభంచనున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు(CM Chandrababu) విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్(Pandit Nehru Bus Station)లో ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan), ఎన్డీఏ కూటమి నాయకుల సమక్షంలో లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు APSRTC బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ స్కీం కింద పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సులు వంటి 8,458 బస్సుల్లో (మొత్తం 11,449 బస్సుల్లో 74%) ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంది.

రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించొచ్చు..
రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఈ సదుపాయం వర్తిస్తుంది. ఆధార్(Aadhar), ఓటరు(Voter ID) గుర్తింపు కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డులతో జీరో ఫేర్ టికెట్లు పొందవచ్చు. ప్రభుత్వ అంచనా ప్రకారం, ఈ పథకం ద్వారా 2.62 కోట్ల మంది మహిళలు లబ్ధి పొందనున్నారు. కుటుంబాలకు నెలకు సగటున రూ.4,000 ఆదా అవుతుంది. ఇది పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక ఊరటనిస్తుంది. అయితే, ఈ పథకం APSRTCకి నెలకు రూ.162 కోట్లు, సంవత్సరానికి రూ.1,942 కోట్ల ఆర్థిక భారాన్ని కలిగిస్తుంది. రద్దీ సమయాల్లో బస్సుల సంఖ్య పెంచడం, సిబ్బంది కొరతను అధిగమించడం వంటి సవాళ్లను ప్రభుత్వం ఎదుర్కోనుంది. ఈ పథకం మహిళల సాధికారత, ఆర్థిక స్వావలంబనకు గట్టి పునాది వేస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
Stree Shakti scheme provides free bus travel for women
*CM Chandrababu Naidu to launch the scheme on August 15
*Crowd management, polite conduct, and women’s safety are paramount
*Bus services to ensure no inconvenience is caused to people
*Comprehensive study for providing
— I & PR Andhra Pradesh (@IPR_AP) August 12, 2025






