AP Government: ఏపీలోని పేదలకు జగన్ సర్కార్ శుభవార్త.. ఏకంగా రూ.25 లక్షల వరకు ఫ్రీ!

మన ఈనాడు: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు గుడ్ న్యూస్. ఆరోగ్య శ్రీ పథకం కింద రూ. 25 లక్షల వరకు చికిత్స ఉచితంగా చేయనున్నారు. డిసెంబర్ 18వ తేదీన సీఎం వైఎస్ జగన్ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి జనవరిలోగా ఆరోగ్య శ్రీ కార్డులను పంపిణీ చేయనున్నారు.
YSR Arogyasri Scheme: ఎన్నికల ముంగిట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ కింద పేద ప్రజలకు రూ. 25 లక్షల వరకు ఉచిత చికిత్స అందించనున్నారు. ఈ పథకాన్ని ఈ నెల 18వ తేదీన సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ పథకంపై సంబంధిత అధికారులతో సీఎం జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇది చరిత్రాత్మక నిర్ణయం అన్నారు సీఎం జగన్. ఆరోగ్యం, విద్య ప్రజలకు ఒక హక్కుగా లభించాలన్నారు. అంతేకాదు.. ఈ హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు సీఎం. అందుకే.. అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ప్రభుత్వం ఈ రెండు అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని, విశేష కృషి చేస్తోందని చెప్పారు. వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ కింద ప్రభుత్వం చేస్తున్న ఖర్చులే దీనికి ఉదాహరణగా పేర్కొన్నారు సీఎం జగన్.

ఈ పథకంలో భాగంగా చికిత్స పరిమితిని రూ. 25 లక్షల వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు సీఎం జగన్. ఎవరికి ఎలాంటి వైద్యం అవసరమైనా రూ.25 లక్షల వరకూ చికిత్స ఉచితంగా లభిస్తుందన్న భరోసా ఇవ్వాలన్నారు. అత్యంత మానవీయ దృక్పథంతో ప్రభుత్వం ఈ విషయంలో ముందడుగు వేస్తోందని చెప్పారు. వైయస్సార్‌ ఆరోగ్య శ్రీ కార్డు ఉందంటే.. ఆ వ్యక్తికి రూ.25 లక్షలు వరకూ వైద్యం ఉచితంగా లభిస్తుందన్నారు. ఎవరికి ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలు వచ్చినా సరే వైయస్సార్‌ ఆరోగ్యశ్రీ అండగా నిలుస్తుందన్నారు. ఆరోగ్యశ్రీలో చికిత్స చేయించుకున్న వారికి మళ్లీ డాక్టర్‌ దగ్గరకు వెళ్లి చెకప్‌ చేయించుకునేందుకు(ఫాలో అప్‌ కన్సల్టేషన్‌) రవాణా ఛార్జీల కింద రూ.300 చెల్లించాలని అధికారులను ఆదేశించారు సీఎం.

Share post:

లేటెస్ట్