ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ కీలక ప్రకటన

ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీ (Telangana Assembly Sessions 2025) వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎస్సీలలో మొత్తం 59 ఉపకులాలను గుర్తించినట్టు ఎస్సీ వర్గీకరణ  కమిషన్‌ నివేదిక సారాంశాం పేర్కొందని తెలిపారు.  ఎస్సీలను గ్రూప్‌-1, 2, 3గా వర్గీకరించాలని సిఫారసు చేసినట్లు వెల్లడించారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల సందర్భంగా ఈ విషయాలను ముఖ్యమంత్రి ప్రకటించారు.

ఎస్సీ వర్గీకరణకు మండలి ఆమోదం

గ్రూప్‌-1లోని 15 ఉపకులాలకు 1 శాతం రిజర్వేషన్‌ (15 ఉపకులాల జనాభా 3.288 శాతం) కల్పించాలని కమిషన్ వెల్లడించినట్లు సీఎం రేవంత్ (CM Revanth Reddy) తెలిపారు.  గ్రూప్‌-2లోని 18 ఎస్సీ ఉపకులాలకు 9 శాతం రిజర్వేషన్‌  (18 ఉపకులాల జనాభా 62.748శాతం) ఇవ్వాలని చెప్పినట్లు పేర్కొన్నారు. ఇక గ్రూప్‌-3లోని ఎఎస్సీ 26 ఉప కులాలకు 5శాతం రిజర్వేషన్‌ (26 ఉప కులాల జనాభా 33.963శాతం) కల్పించాలని వర్గీకరణ కమిషన్‌ తన నివేదికలో పేర్కొందని వివరించారు. మరోవైపు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ శాసనమండలి ఆమోదం తెలిపింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *