హైదరాబాద్‌లోని గోషామహల్(Goshamahal Police Ground) పోలీస్ గ్రౌండ్‌లో నూతన ఉస్మానియా ఆస్పత్రి(Osmania Hospital) నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revant Reddy) భూమిపూజ(Bhumi Puja) చేశారు. అత్యాధునిక హంగులతో ఈ ఆసుపత్రిని నిర్మించనుంది తెలగాణ ప్రభుత్వం. దాదాపు 26.30 ఎకరాల్లో ఈ ఆసుపత్రి నిర్మాణం జరుగనుంది. ఈ పూజా కారక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka), మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, CS శాంతికుమారితో పాటు MLAలు, అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్దయెత్తున హాజరయ్యారు.
అన్ని వసతులతో 41 ఆపరేషన్ థియేటర్లు
ఇక, సుమారు రూ.2,700 కోట్ల వ్యయంతో 26.30 ఎకరాల్లో ఉస్మానియా ఆస్పత్రిని నిర్మిస్తున్నారు. 32 లక్షల చదరపు అడుగుల భవనాలతో పాటు 2 వేల పడకల సామర్థ్యంతో ఆస్పత్రిని నిర్మించనున్నారు. 500 బెడ్లతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ICU).. 30 స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాలు.. అధునాతన వసతులతో 41 ఆపరేషన్ థియేటర్లు.. అలాగే, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ(Advanced technology)తో కూడిన అవయవ మార్పిడి శస్త్ర చికిత్సల విభాగం కూడా ఏర్పాటు చేయనున్నారు.
నిత్యన్నదానం కోసం ధర్మశాల
దీంతో పాటు ఆస్పత్రికి అనుబంధంగా డెంటల్, నర్సింగ్, ఫిజియోథెరపీ కాలేజీలను.. 750 సీట్ల కెపాసిటీతో భారీ ఆడిటోరియం(A huge auditorium) నిర్మించనున్నారు. విద్యార్థులు, స్టాఫ్ కోసం రెసిడెన్షియల్, ప్లే జోన్లు.. పేషెంట్ అటెండర్లకు నిత్యన్నదానం కోసం ధర్మశాల(Dharamshala)ను కూడా నిర్మించేలా ప్లాన్ చేస్తుంది ప్రభుత్వం. 2 వేల కార్లు, వెయ్యి బైక్‌లకు సరిపడా అండర్‌గ్రౌండ్ పార్కింగ్ ఫెసిలిటీ(Underground parking facility)తో పాటు నలువైపులా విశాలమైన రోడ్లు, ఆహ్లాదకర వాతావరణం ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
#Hyderabad—#Telangana chief minister @revanth_anumula laid a foundation stone for the construction of new 2,000-bed #Osmania General Hospital (OGH) at #Goshamahal on Friday.
The new hospital will feature a built-up area of 32 lakh square feet and would adhere to the norms… pic.twitter.com/fsrppwYLSz
— NewsMeter (@NewsMeter_In) January 31, 2025






