తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు (Telangana Formation Day) రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రజలకు మఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) రాష్ట్రావతరణ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండా ఆవిష్కరించి ప్రసంగించారు. దశాబ్దాల పోరాటంతో తెలంగాణను సాధించుకున్నామని ఉద్ఘాటించారు. సకల జనుల ఆకాంక్షలు నెరవేరిన రోజు అని అభివర్ణించారు. తెలంగాణను పున:నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నామని, రాష్ట్రం వచ్చి పదేళ్లయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు.
మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ ఉద్ఘాటించారు. ఆడబిడ్డలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నామని స్పష్టం చేశారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని గుర్తుచేశారు. దేశంలో అదానీ, అంబానీలతో పోటీ పడేలా మహిళా స్వయం సహాయక సంఘాలతో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయించామన్నారు. పెట్రోల్ బంకులు, పాఠశాలల నిర్వహణ, యూనిఫాంల కుట్టుపనితో పాటు మహిళా శక్తి క్యాంటీన్లు నిర్వహించేలా మహిళలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు అందిస్తున్నామన్నారు.
రైతులను రుణ విముక్తులను చేశాం..
రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని, ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేశామని పేర్కొన్నారు. రూ.15,333 కోట్లతో రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. వరి ధాన్యానికి మద్ధతు ధరతో పాటు సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన16నెలల్లోనే 60వేలకు పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి, నియామక పత్రాలను అందించాం. డైట్ చార్జీలను 40శాతం, కాస్మోటిక్ చార్జీలను 200 శాతం పెంచిన విషయాన్ని గుర్తుచేశారు. దేశాన్ని 30 ట్రిలియన్ ఎకానమీ తీర్చిదిద్దడంలో తెలంగాణను అగ్రభాగాన నిలిపేందుకు ప్రయత్నం చేస్తున్నాం. 2047నాటికి ప్రపంచంలోనే తెలంగాణను నెంబర్ వన్ గా నిలిపే దిశగా ప్రజా ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోందని పేర్కొన్నారు.
#Hyderabad—#Telangana aims for $1 Trillion Economy in 10 Years: CM Revanth Reddy
Chief Minister @revanth_anumula on Monday announced an ambitious economic vision for the state, aiming to grow Telangana into a $1 trillion economy over the next decade, and $3 trillion by 2047,… pic.twitter.com/XOZAW7iyat
— NewsMeter (@NewsMeter_In) June 2, 2025






