
ఏపీ ప్రభుత్వం(AP Govt) గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project)పై సీఎం రేవంత్(CM Revanth Reddy) అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణలోని ఆల్ పార్టీ ఎంపీల(All party MPs)తో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత BRS ప్రభుత్వం కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)ను నిర్మించిందని ఆరోపించారు. గ్రావిటీ ద్వారా నీళ్లు అందించాల్సిందిపోయి KCR, హరీశ్ రావు కమీషన్ల కాసులకు కక్కుర్తిపడి లిఫ్ట్ ఇరిగేషన్లతో కాళేశ్వరం చేపట్టారని ధ్వజమెత్తారు. బనకచర్లతో తెలంగాణకు నష్టం జరిగితే ఉరితీయాల్సింది KCRనేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే కేంద్రంలో పలుకుబడి ఉందని అన్ని ప్రాజెక్టులకూ అనుమతులు వస్తాయని అనుకోవద్దని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu)కు సీఎం రేవంత్ సూచించారు.
కాళేశ్వరం విచారణ డైవర్ట్ చేయడానికే విమర్శలు
‘బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి లేఖ రాసి ఫిర్యాదులు చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై నిర్లక్ష్యం చేయడం లేదు. బనకచర్ల ప్రాజెక్టు సామర్థ్యం 200TMCలని చెబుతున్నారు. వాస్తవంగా 300TMCలు తరలించాలనేది బనకచర్ల లక్ష్యం. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరంతో లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదు. మూడేళ్లలో కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలిపోయింది. కాళేశ్వరంలో చేసిన తప్పులకు కేసీఆర్ విచారణ ఎదుర్కొంటున్నారు. కాళేశ్వరం విచారణ డైవర్ట్ చేయడానికి ప్రభుత్వంపై బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది’ అని విమర్శించారు.
ఏపీ సీఎం చంద్రబాబుకి కీలక సూచనలు
అలాగే ఏపీ సీఎం చంద్రబాబుకి కూడా కీలక సూచనలు చేశారు. కేంద్రం(Central)లో పలుకుబడి ఉందని అన్ని ప్రాజెక్టులకూ అనుమతులు వస్తాయని అనుకోవద్దని చంద్రబాబుకు ఆయన సూచించారు. ‘ప్రధాని మోదీ(PM Modi)పై ఒత్తిడి తెచ్చి అనుమతులు తెచ్చుకోవడం వల్ల ఇవి పూర్తి కావు. గోదావరి బేసిన్‌లోని 968TMCలు, కృష్ణా బేసిన్‌లోని 555TMCలలో తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మించుకుంటాం. అన్నింటికీ NOC ఇవ్వండి. ఆ తర్వాత సముద్రంలోకి పోయే నీళ్లు AP తీసుకోవడానికి ఇబ్బంది లేదు’ అని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.
🟥NEW SENSE
Source – Naveena
AP CM Chandrababu Naidu is in delusion if he thinks, he will get permissions for all projects just because PM Modi listens to him – CM Revanth Reddy
We will fight for Telangana rights in all constitutional forums
If Chandrababu really believes if… pic.twitter.com/SuTuEdDhlr
— NEW SENSE (@Shyamsundarak6) June 18, 2025