Rythu Bharosa: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్

తెలంగాణ రైతుల(Telangana Farmers)కు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా(Rythu Bharosa) నిధులను జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. ఎన్ని ఎకరాలున్నా రైతులందరికీ రైతు భరోసాను అందజేస్తామని ప్రకటించారు. ఈ మేరకు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ(Professor Jayashankar Agricultural University)లో జరిగిన రైతు నేస్తం(Rythu Nestam) కార్యక్రమంలో సీఎం బటన్ నొక్కి 70,11,984 మంది అన్నదాతలకు డబ్బులు జమ చేశారు. 7 రోజుల్లోనే రైతులందరి అకౌంట్లలోకి రైతు భరోసా నగదు పడుతుందని సీఎం చెప్పారు.

రైతుల ఆశీర్వాదం లేకుంటే.. అధికార పీఠం మీద కూర్చోలేరు

ఈ సందర్భంగా సీఎం రైతులతో ముచ్చటించారు. ఇందిరమ్మ రాజ్యంలో రైతును రాజును.. వ్యవసాయాన్నీ పండగ చేయాలనేది తమ ఆలోచన అన్నారు. రైతుల ఆశీర్వాదం లేకుంటే.. అధికార పీఠం మీద కూర్చోలేరు అని తేల్చి చెప్పారు. శాసన సభ అయిన.. వార్డు మెంబరుగా గెలవాలన్నా రైతుల మద్దతు అవసరం అని సీఎం రేవంత్ వెల్లడించారు. సంక్షేమ పథకాల(Welfare schemes)పై విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రులకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల(Local body elections) గురించి కూడా CM చర్చించారు. జిల్లా నేతలతో ఇన్‌ఛార్జ్ మంత్రులు సమన్వయం చేసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పలువురు MLAలు పాల్గొన్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *