Rain Alert: అకాల వర్షం.. అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష

తెలంగాణ(Telangana)లో అకాల వర్షాలు(Rains) అతలాకుతలం చేశాయి. దీంతో రైతులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా హైదరాబాద్(Hyderabad) మహానగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. ఉరుములు, మెరుపులు, గాలి దుమారంతో కూడిన వర్షంతో నగర రోడ్లన్నీ చెరువులను తలపించాయి. భారీ వరదకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపై నీరు నిలవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్(Cm Revanth) వర్షాలపై అన్ని శాఖల అధికారులతో సమీక్షించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎస్ శాంతికుమారి(CS Shanti kumari)ని ఆదేశించారు.

జిల్లాల కలెక్టర్లు, పోలీసులతో సమీక్ష

అలాగే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. రోడ్లపై నీటి నిల్వలు లేకుండా ట్రాఫిక్ స‌మ‌స్య‌, విద్యుత్(Power Issue) అంత‌రాయాలు లేకుండా GHMC, పోలీస్, హైడ్రా, విభాగాలు సమన్వయంతో పని చేయాలని CM ఆదేశించారు. అటు పలు జిల్లాల్లో కూడా వర్షాలు, ఈదురుగాలులు, వడగండ్లు పడుతున్నందున జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు, అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశించారు.

జోనల్ కమిషనర్లతో మేయర్ టెలీకాన్ఫరెన్స్

అటు అకాల వర్షాలకు సంబంధించి అన్ని జోనల్ కమిషనర్లతో మేయర్ విజయలక్ష్మి(Mayor Vijayalakshmi) టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజల అసౌకర్యాన్ని తగ్గించడానికి అధిక అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రధాన నీటి ఎద్దడి ప్రాంతాలను తొలగించినట్లు తెలిపారు. ఏవైనా వర్ష సంబంధిత సమస్యలు లేదా GHMC-DRF సహాయం కోసం కంట్రోల్ రూమ్‌ నంబర్ 040-21111111ను ఏర్పాటు చేసినట్లు మేయర్ తెలిపారు. ప్రజలు ఎలాంటి వర్ష సమస్య ఉన్నా ఈ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

Related Posts

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మరో వారం రోజులూ జోరు వర్షాలు: IMD

తెలుగు రాష్ట్రాలను వర్షాలు(Rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని నదులు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ(Department of Meteorology) మరో పిడుగులాంటి వార్త చెప్పింది. ఛత్తీస్‌గఢ్‌ పరిసర…

Rain News: మరో అల్పపీడనం.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం!

ఇటీవల భారీ వర్షాలు(heavy rains) తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. వరుణుడి దెబ్బకు AP, తెలంగాణ(Telangana)లోని ప్రాజెక్టులననీ జలకళను సంతరించుకున్నాయి. కృష్ణా, గోదావరి నదులతోపాటు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయితే రెండు రోజులుగా శాంతించిన వరుణుడు మళ్లీ రానున్నాడు.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *