Numaish: నేడే నుమాయిష్ ప్రారంభం.. 44 రోజులు సందడే సందడి!

భాగ్యనగరవాసులను, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులను అలరించేందుకు నుమాయిష్‌ (All India Industrial Exhibition) సిద్ధమైంది. హైదరాబాద్‌ నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌(Exhibition Ground at Nampally)లో నుమాయిష్ జనవరి 1నే ప్రారంభం కావాలి. కానీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో జనవరి 3కి వాయిదా పడింది. దీంతో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) 84వ నుమాయిష్‌ను ప్రారంభించనున్నారు. ఇది 44 రోజుల పాటు అంటే ఫిబ్రవరి 15 వరకూ కొనసాగుతుంది. ఈసారి ఎగ్జిబిషన్‌ను చుట్టి వచ్చేందుకు అద్దాలతో కూడిన డబుల్‌ డెక్కర్‌ బస్సుల(Double decker buses)ను అందుబాటులో ఉంచారు.

100 సీసీ కెమెరాలతో పటిష్ఠ భద్రత

అయితే ఈసారి ప్రవేశ రుసుమును రూ.10 పెంచి.. రూ.50 చేశారు. కాగా, ఏటా 25 లక్షల మంది నుమాయిష్‌(Numaish)ను సందర్శిస్తుంటారు. సుమారు 2వేల స్టాళ్లతో కొనసాగే ఈ ఎగ్జిబిషన్‌కు జిల్లాలు, ఇతర రాష్ట్రాల వారు కూడా వస్తుంటారు. కాగా, ఎగ్జిబిషన్‌ ద్వారా గత సంవత్సరం GST రూ.9.66 కోట్లు వసూలైంది. 10 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. మొత్తం 26 ఎకరాలలో ప్రదర్శన నిర్వహించనున్నట్లు ఎగ్జిబిషన్‌ సొసైటీ తెలిపింది. సందర్శకుల భద్రతపై 100 CC కెమెరాలు, వాచ్‌ టవర్లతో నిఘా ఏర్పాటు చేశారు.

సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

ఇదిలా ఉండగా 5 సంవత్సరాల లోపు పిల్లలకు ఫ్రీ ఎంట్రీ(Free Entry) ఉంది. సీనియర్ సిటిజన్ల కోసం వీల్ చైర్లను ఉంచారు. ఎగ్జిబిషన్ మధ్యలో టాయ్ ట్రైన్ ప్రతీ అరగంటకోసారి ఓ రౌండ్ వేస్తుంది. ఎంట్రీకి ఒక టికెట్, టాయ్ ట్రైన్‌(Toy train)కి వేరే టికెట్ ఉంటుంది. ట్రైన్ ఎక్కాలి అనుకునేవారు.. ట్రైన్ దగ్గరే టికెట్ కొనుక్కోవచ్చు. లోపల ఫ్రీ పార్కింగ్ ఉంది. మీరు మెట్రో రైలులో రావాలంటే.. గాంధీభవన్ స్టేషన్ దగ్గర దిగవచ్చు. అక్కడి నుంచి 5 నిమిషాలు వాకింగ్ చేస్తే చాలు. ఉదయం నుంచి రాత్రి 10.30 వరకు, వీకెండ్స్‌లో రాత్రి 11 గంటల వరకు తెరిచే ఉంటుంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *