Mana Enadu : ‘కలర్ ఫొటో (Color Photo)’ సినిమాతో సెన్సేషనల్ హిట్ తో పాటు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నాడు డైరెక్టర్ సందీప్ రాజ్ (Sandeep Raj). ఆయన త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. టాలీవుడ్ నటి చాందినీ రావుతో సోమవారం రోజున ఆయన నిశ్చితార్థం సోమవారం జరిగింది. ఈ వేడుక విశాఖపట్నంలో జరిగినట్టు సమాచారం. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.
Congratulations to Director #SandeepRaj and actress #ChandiniRao on their engagement@SandeepRaaaj pic.twitter.com/2izl7ZDGVa
— Teju PRO (@Teju_PRO) November 12, 2024
డిసెంబరు ఫస్ట్ వీక్‌లో ఈ జంట వివాహం జరగనున్నట్లు సమాచారం. ‘కలర్ ఫొటో’ సినిమాలో చాందినీ రావు (Chandini Rao) కూడా నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఈ ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి పెళ్లి వరకూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ జంట ఇరు కుటుంబాలను ఒప్పించి త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటి కానుంది. ఇక ‘హెడ్స్ అండ్ టేల్స్ (Heads And Tales)’ అనే వెబ్‌సిరీస్‌లోనూ చాందినీ నటించారు.
మరోవైపు సందీప్ రాజ్ షార్ట్ ఫిల్మ్స్ నుంచి తన సినీ ప్రయాణం మొదలు పెట్టారు. కలర్ ఫొటో సినిమాను తెరకెక్కించిన ఆయన.. ‘హెడ్స్ అండ్ టేల్స్’ వెబ్ సిరీస్‌తో పాటు ‘ముఖ చిత్రం’ సినిమాలకు కథలు అందించాడు. ‘కలర్ ఫొటో’ సినిమాకు. ఉత్తమ తెలుగు చిత్రం విభాగంలో ఆయనకు ఈ జాతీయ పురస్కారం (National Award) అందుకున్నారు.






