డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నటులు శ్రీరామ్ (Sriram)కు ఊరట లభించింది. ఆయనతోపాటు ఇదే కేసులో అరెస్టయిన కృష్ణ (krishna)కు నిబంధనలతో కూడిన బెయిలు మంజూరైంది. డ్రగ్స్ వినియోగం కేసులో గత నెలలో అరెస్ట్ అయ్యి జైలులో ఉన్న శ్రీకాంత్, కృష్ణ తమకు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లు న్యాయమూర్తి విచారించారు. అరెస్ట్ సమయంలో శ్రీకాంత్ వద్ద ఎలాంటి డ్రగ్స్ స్వాధీనం చేసుకోలేదని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. కృష్ణకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో డ్రగ్స్ వినియోగించినట్లు నిరూపణ కాలేదని కృష్ణ తరఫు న్యాయవాది వెల్లడించారు.
షరతులతో కూడిన బెయిల్
కానీ ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ చేసిన AIADMK మాజీ నేత, నిందితుల వాంగ్మూలం ఆధారంగా శ్రీకాంత్, కృష్ణలను అరెస్ట్ చేశామని, వారికి బెయిలు మంజూరు చేయొద్దని పోలీసుల తరపు న్యాయవాది కోరారు. ఇరువురి వాదనల అనంతరం శ్రీకాంత్, కృష్ణకు బెయిలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రూ.10 వేల పూచీకత్తు సమర్పించాలని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు దర్యాప్తు అధికారి ముందు హాజరై సంతకం చేయాలని న్యాయమూర్తి నిబంధనలు విధించారు.
#Sriram #Krishna pic.twitter.com/CN98heZUs7
— CinemasJunction (@CinemasJunction) July 9, 2025
జూన్ 23న అరెస్ట్.. జ్యుడీషియల్ కస్టడీ
ఏఐడీఎంకే (AIADMK) మాజీ నేత ప్రసాద్ నుంచి శ్రీరామ్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఆరోపణలు రావడంతో జూన్ 23న ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలోని ఓ బార్‌లో గొడవకు సంబంధించి అన్నాడీఎంకే నాయకులు ప్రసాద్, అజయ్ వాండైయార్‌తో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. వీరు మత్తు పదార్థాలు వాడినట్లు ఫిర్యాదులు రావడంతో ఎవరి నుంచి కొనుగోలు చేశారని, ఎవరెవరికి సరఫరా చేశారని పోలీసులు ఆరా తీశారు. దీంతో శ్రీరాం డ్రగ్స్ సరఫరా చేసినట్లు తెలిసింది. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రవేశపెట్టగా జ్యుడీషియల్ కస్టడీ విధించింది.






