Ram Charan: ప్రతి విషయంలోనూ నిజమైన ‘గేమ్ ఛేంజర్’.. ఉపాసన ట్వీట్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన గేమ్ ఛేంజర్(Game Changer) మూవీ ఈ రోజు గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. కోలీవుడ్ డైరెక్టర్ శంకర్(Director Shankar) తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్(Box Office) వద్ద హిట్ సొంతం చేసుకుంది. ఫస్ట్‌ షో నుంచే అభిమానులు థియేటర్లకు పెద్దయెత్తున చేరుకొని సినిమా హాళ్ల వద్ద హంగామా చేశారు. చెర్రీ దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత సోలోగా చేసిన చిత్రం కావడంతో అటు ఇండస్ట్రీ వర్గాలతోపాటు అభిమానుల్లోనూ గేమ్ ఛేంజర్‌పై భారీ హైప్ నెలకొంది. దిల్ రాజు(Dil Raju) భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ మూవీలో చెర్రీ తన సాలిడ్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. రివ్యూలు సైతం పాజిటివ్‌(Positive Talk)గా వస్తుండటంతో మేకర్స్‌ సైతం ఖుషీ అవుతున్నారు. తాజాగా చెర్రీ మూవీపై ఆయన భార్య ఉపాసన కొణిదెల(Upasana Konidela) ట్విటర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు.

మూవీకి వస్తున్న రెస్పాన్స్ అద్భుతం

‘గేమ్ ఛేంజర్(Game Changer)’ మూవీకి వస్తున్న రెస్పాన్స్ అద్భుతంగా ఉందని.. ఈ సందర్భంగా రామ్ చరణ్‌కు కంగ్రాట్స్(Congrats) చెబుతున్నట్లు ఆమె తెలిపారు. ఇక ప్రతి విషయంలోనూ రామ్ చరణ్ నిజమైన ‘గేమ్ ఛేంజర్’ అని ఆమె తన ట్వీట్‌లో రాసుకొచ్చారు ఉపాసన. ఇలా తన భర్త సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌పై ఉపాసన ట్వీట్(Tweet) చేయడంతో ఆ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇక ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలో రామ్ చరణ్ తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్, ఎస్.జె.సూర్య ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు.

 

చెర్రీ కెరీర్‌లో మరో హిట్

ఇదిలా ఉండగా రాజకీయాల(Politics) నేపథ్యంలో నడిచే ఓ కథాంశం ఎంచుకుని, వ్యవస్థను ప్రక్షాళనను చేసే IAS అధికారి చుట్టూ సాగే విధంగా దర్శకుడు శంకర్‌ ఈ కథను అల్లుకున్నాడు. ఆయన గత చిత్రాలు ‘ఒకే ఒక్కడు’ తో పాటు ‘శివాజీ’ చిత్రాలు గుర్తొచ్చే విధంగా ఈ కథాంశం ఉంటుంది. ఇలాంటి ఓ కథను ఎంచుకున్నప్పుడు సన్నివేశాలు చాలా చక్కగా ఉన్నాయని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక SJ సూర్య, అంజలి పర్ఫార్మెన్స్ అదిరిపోయిందంటూ రివ్యూలు ఇచ్చేస్తున్నారు. పాటలు, తమన్(Taman) మ్యూజిక్ మాత్రం ఓ రేంజ్‌లో ఉందంటూ కొనియాడుతున్నారు. మొత్తం చెర్రీ కెరీర్‌లో మరో హిట్ పడిందంటూ మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Megastar Chiranjeevi: చిరూని కలిసి మహిళా వీరాభిమాని.. రాఖీ కట్టి తీవ్ర భావోద్వేగం 

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వీరాభిమాని రాజేశ్వరి(Rajeshwari), తన ఆరాధ్య నటుడిని కలిసేందుకు సైకిల్‌(Cycle)పై సుదీర్ఘ ప్రయాణం చేసి హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఈ సంఘటన చిరంజీవిని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాక, అభిమానుల హృదయాలను కూడా కదిలించింది. రాజేశ్వరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *