
తెలంగాణలో మరో ఉప ఎన్నిక(Bypoll) రాబోతోంది. హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్(Jubilee Hills) ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(Maganti Gipinath) అకాల మరణంతో ఆ నియోజకవర్గంలో ఖాళీ ఏర్పడింది. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో భాగ్యనగరంలో మరోసారి పొలిటికల్ హీట్ మొదలైంది. ఇప్పటికే అధికార కాంగ్రెస్(Congress), విపక్ష పార్టీలైన BRS, BJPలు అభ్యర్థుల వేట మొదలుపెట్టాయి. ఇదిలా ఉండగా కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని BRS చెబుతుంటే, అలాంటి పరిస్థితే లేదంటోంది కాంగ్రెస్. ఇదే టైమ్‌లో కాంగ్రెస్, BRSలను టార్గెట్ చేస్తూ BJP నేతలు వాయిస్ పెంచుతున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
సిట్టింగ్ సీటును కాపాడుకుంటుందా?
జూబ్లీహిల్స్ స్థానానికి ఉపఎన్నిక రానున్న నేపథ్యంలో ఈ సిట్టింగ్ సీటును కాపాడుకోవటం BRS పార్టీకి అతిపెద్ద సవాల్‌గా మారనుంది. ఇందుకోసం ఆ పార్టీ అధినాయకత్వ అప్పుడే కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మాగంటి గోపినాథ్ భార్యకు టికెట్ ఇవ్వటమా? లేక మరో నాయకుడిని తెరపైకి తీసుకురావటమా అనే విషయంపై మల్లగుల్లాలు పడుతోంది. PJR కుమారుడైన విష్ణువర్ధన్ రెడ్డి(Vishnu Vardhan Reddy)తో పాటు రావుల శ్రీధర్ రెడ్డి(Ravula Sridhar Reddy) పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ నుంచి మళ్లీ ఆయననేనా..
ఇక అధికార కాంగ్రెస్ తరఫున అజహరుద్దీన్(Azharuddin) మరోసారి బరిలో నిలిచే అవకాశం ఉంది. ఇదే విషయంపై తాజాగా మాట్లాడిన ఆయన రానున్న ఉప ఎన్నికలో పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఇదే టికెట్ పై మరో నేత ఫిరోజ్ ఖాన్(Firoz Khan) కూడా ఆశలు పెంచుకుంటున్నారు. అజహరుద్దీన్ కు టికెట్ రాకపోతే…. తన పేరును పరిశీలించాలని కోరుతున్నారు. వీరిద్దరే కాకుండా మరికొంత మంది నేతలు కూడా ప్రయత్నాలు చేసే చేస్తున్నట్లు తెలుస్తోంది.
Candidate not yet finalised for Jubilee Hills bypoll, says Telangana Congress chiefhttps://t.co/5huinMTXBx
— TheNewsMinute (@thenewsminute) June 21, 2025
కమలం తరఫున బరిలో నిలిచేదెవరు?
ఇక BJPకి కూడా ఈ ఉపఎన్నిక ఛాలెంజ్ అనే చెప్పొచ్చు. గ్రేటర్ పరిధిలో ఆ పార్టీకి కార్పొరేటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో జూబ్లీహిల్స్ లో జెండా ఎగరవేయాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన లంకెల దీపక్రెడ్డి(Lankela Deepak Reddy), కీర్తిరెడ్డి, డాక్టర్ పద్మ వీరపనేని పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇక బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి(Bandaru Vijayalaxmi) కూడా పోటీపై ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.