పార్లమెంట్ వర్షాకాల సమావేశా(Parliament monsoon sessions)ల్లో భాగంగా నేడు (జులై 28) లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై చర్చ జరగనుంది. ఈ మేరకు అన్ని పార్టీలు విప్ జారీ చేయగా దేశ ప్రజలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర హోంమంత్రి చిదంబరం(P Chidambaram) ఆపరేషన్ సిందూర్‌పై అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి (Pahalgam terrorist attack), ఆ తర్వాత జరిగిన ఆపరేషన్ సిందూర్‌ను కేంద్ర ప్రభుత్వం (Central Govt) నిర్వహించిన తీరుపై ఆయన అనేక ప్రశ్నలు లేవనెత్తారు.

కేంద్రం వారిని ఎందుకు పట్టుకోలేదు?
పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam terror attack)పై ప్రభుత్వం(Govt) తగినంత సమాచారం అందించలేదు, కీలక వివరాలను పంచుకోవడానికి ఇష్టపడలేదని చిదంబరం ఆరోపించారు. ‘‘ఉగ్రవాద దాడి(terrorist attack) చేసిన వారు ఎక్కడ ఉన్నారు? కేంద్రం వారిని ఎందుకు పట్టుకోలేదు? దాడి జరిగి చాలా రోజులవుతున్నా NIA ఏం చేస్తోంది? టెర్రరిస్టు(Terrorists)లను పట్టుకుందా? వాళ్లు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్లు స్వదేశీ ఉగ్రవాదులు కూడా అయ్యుండొచ్చు. పాకిస్థాన్ నుంచే వచ్చారని ఎందుకనుకోవాలి? ఆధారాలున్నాయా?’’ అని ప్రశ్నించారు.
Once again, Congress gives a clean chit to Pakistan after a terror attack.
P. Chidambaram: “You have no proof the terrorists came from Pakistan, why are you assuming that?”
Soft on terror, softer on Pakistan. pic.twitter.com/baX8IipRGZ
— Political Kida (@PoliticalKida) July 27, 2025
పీఎం మోదీ, రక్షణ మంత్రి ఎందుకు స్పందించలేదు?
అలాగే ఈ దాడి చేసిన వారికి ఆశ్రయం ఇచ్చిన కొంతమంది వ్యక్తుల అరెస్ట్ గురించి ఒక వార్త వెలువడింది. వారికి ఏమైందని ప్రశ్నించారు. ఈ ఘటన అనంతరం వివిధ స్థాయిల్లో అధికారులు ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతం నుంచి ప్రకటన చేశారు కానీ.. భారత ప్రధాని మోదీ, రక్షణ మంత్రి, విదేశాంగ మంత్రి ఎందుకు సమగ్ర ప్రకటన చేయడం లేదు?” అని ఆయన ప్రశ్నించారు. దీంతో బీజేపీ, ఎన్డీయే కూటమి నేతలు కాంగ్రెస్ పార్టీ తన వక్రబుద్ధిని బయటపెట్టిందని ఫైరవుతున్నారు.






