
నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ఇటీవలే ఛావా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ భామపై కర్ణాటకలోని మండ్యాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే (MLA Ravi) రవి గనిగ తీవ్రంగా ఫైర్ అయ్యారు. బెంగళూరు వేదికగా జరుగుతోన్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు ఆమెను ఆహ్వానిస్తే అందుకు అంగీకరించలేదని ఆరోపించారు. ఆమెకు సరైన గుణపాఠం చెప్పాలని తాజాగా జరిగిన ప్రెస్‌మీట్‌లో మండిపడ్డారు.
ఆమెకు బుద్ధి చెప్పాల్సిందే
‘‘పుట్టిన ఊరును, కన్నవాళ్లను, అవకాశం ఇచ్చిన, సాయం చేసిన వారిని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. కానీ హీరోయిన్ రష్మిక మాత్రం తనకు కెరీర్ ఇచ్చిన ఇండస్ట్రీ ఉన్న రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేశారు. కిరిక్ పార్టీ (Kirik Party) అనే కన్నడ సినిమాతో ఈ రాష్ట్రంలోనే తన కెరీర్‌ను ప్రారంభించిన రష్మికను.. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (International Film Festival 2025)కు హాజరు కావాలని కోరుతూ గతేడాది ఎన్నోసార్లు ఆమెను కోరినా.. తాను రానని, తనకు టైం లేదని చెప్పారు.
నటులు కాంగ్రెస్ కార్యకర్తలు కారు
అంతే కాదు మా ఇల్లు హైదరాబాద్‌లో ఉంది. కర్ణాటక ఎక్కడో నాకు తెలియదు అన్నట్లు ఆమె మాట్లాడటం నాకు బాధగా అనిపించింది. శాండల్ వుడ్, కన్నడ భాష పట్ల ఆమె అగౌరవంగా వ్యవహరించారు. ఆమెకు సరైన గుణపాఠం నేర్పించాల్సిన అవసరం ఉంది”. అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వ్యాఖ్యలపై బీజేపీ, జేడీఎస్ స్పందించాయి. మీరు చెప్పినప్పుడల్లా నడుచుకోవడానికి నటులు కాంగ్రెస్ కార్యకర్తలు కారంటూ చురకలంటించాయి.