
హుజూరాబాద్ నియోజకవర్గ BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి(Padi Kaushik Reddy)కి ఊరట లభించింది. ఒక క్వారీ(Quarry) యజమానిని బెదిరించారన్న ఆరోపణలతో అరెస్టయిన ఆయనకు న్యాయస్థానం శనివారం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. పోలీసులు ఆయన రిమాండ్(Remand) కోరగా, కోర్టు దానిని తిరస్కరించడం గమనార్హం. వివరాల్లోకి వెళితే, ఒక క్వారీ యజమాని పట్ల బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై పోలీసులు BRS MLA పాడి కౌశిక్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
#BRS MLA #KaushikReddy Arrested at RGI Airport in #Hyderabad#Hanumakonda police on Friday arrested BRS party MLA Kaushik Reddy at Rajiv Gandhi International Airport, Hyderabad.
The arrest was made in connection with a case involving alleged threats made to a granite trader… pic.twitter.com/1vtXKMO4VB
— BNN Channel (@Bavazir_network) June 21, 2025
నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు చేశారని..
అరెస్టు అనంతరం, వరంగల్(Warangal)లోని MGM ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత కౌశిక్‌రెడ్డిని కాజీపేట రైల్వే కోర్టు(Kazipet Railway Court)లో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయస్థానం(Court)లో విచారణ సందర్భంగా, కౌశిక్‌రెడ్డి తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపించారు. అరెస్టుకు ముందు పోలీసులు చట్టప్రకారం 41Aనోటీసులు జారీ చేయలేదని, నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి, కౌశిక్ రెడ్డి రిమాండ్‌ను తిరస్కరిస్తూ, కొన్ని షరతులతో కూడిన బెయిల్(Conditional Bail)ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.