Kannappa Prerelease Event: డబ్బుకు ప్రాధాన్యమిస్తూ గౌరవించే వ్యక్తి మోహన్‌బాబు: బ్రహ్మానందం

మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప(Kannappa)’ చిత్రం జూన్ 27వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ‘కన్నప్ప’ ప్రీరిలీజ్ ఈవెంట్(Kannappa Prerelease Event) శనివారం రాత్రి హైదరాబాద్ ఫిలీంనగర్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి కన్నప్ప టీమ్, సీనయర్ నటులు మోహన్ బాబు(Mohan Babu), శరత్ కుమార్, బ్రహ్మానందం, ముకేశ్ రుషితోపాటు మంచు మనోజ్, శివ బాలాజీ, కౌశల్, నటి మధుబాల, సినీప్రముఖులు పరుచూరి గోపాలకృష్ణ, డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్(Mukesh kumar singh), మ్యూజిక్ డైరెక్టర్స్ మణిశర్మ, స్టీఫెన్ దేవస్సీ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘హాస్య బ్రహ్మ’ బ్రహ్మానందం(Brahmanandam) కన్నప్ప మూవీ గురించి, మంచు మోహన్ బాబు గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

నాకు.. అసలు మోహన్ బాబే నచ్చడు

మోహన్ బాబులో నచ్చిన, నచ్చని విషయాలు చెప్పాలని బ్రహ్మానందాన్ని యాంకర్ సుమ(Anchor Suma) అడిగారు. దీనికి సరదాగా సమాధానం చెప్పారు బ్రహ్మానందం. నచ్చినవి, నచ్చనవీ ఏవీ లేవని చెప్పారు. “అసలు మోహన్ బాబే నచ్చడు నాకు” అని సరదాగా అన్నారు బ్రహ్మీ. అవాక్కయ్యానని సుమ అంటే.. అందుకు చాలా కారణాలు ఉన్నాయంటూ సరదాగా అన్నారు బ్రహ్మానందం. మోహన్ బాబు అంటే బ్రహ్మానందానికి చాలా ఇష్టమని, ఆయన ఇందాక చెప్పినవన్నీ సరదాగానే అని సుమ అన్నారు. దీనికి ఆయన కూడా తల ఊపారు. “ఒక మహానటుడిని ఇష్టపడని వారు ఎవరు ఉంటారు” అని బ్రహ్మానందం చెప్పారు.

మోహన్ బాబు ఆల్కహాల్ లాంటి వారు..

మోహన్ బాబు(Mohan Babu) ఓ చిన్న ఆల్కహాల్ లాంటి వారని, అలవాటైతే వదిలిపెట్టలేమని బ్రహ్మానందం అన్నారు. డబ్బుకు ప్రాధాన్యమిస్తూ గౌరవించే వ్యక్తి మోహన్‌బాబు. రూ.200 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాని ఎందుకు ప్లాన్‌ చేశాడు? అని ఓ సారి అనుకున్నా. కానీ ఈ సినిమా ఆలోచన పరమేశ్వరుడిది. ప్రజల్లో భక్తి సన్నగిల్లి అరాచకాలు పెరుగుతున్న సమయంలో సాక్షాత్తూ శివుడే మోహన్ బాబుకు కన్నప్ప తీయాలనే ఆలోచన కల్పించాడని అన్నారు. ఇక ప్రభాస్(Prabhas) గురించి మాట్లాడుతూ.. ఆయన ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తి అని, మోహన్ బాబు మత్తులో, ప్రేమలో మునిగితేలినటువంటి వ్యక్తి ప్రభాస్ అని బ్రహ్మానందం అన్నారు. ఈ చిత్రంలో ఆయన పాత్ర అద్భుతంగా ఉంటుందని చెప్పారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *