Dail 112: అత్యవసర ఫిర్యాదు చేయాలా.. అయితే ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి

అత్యవసర ఫిర్యాదుల(Emergency complaints)కు దేశవ్యాప్తంగా ఒకటే నంబర్‌ ఉండాలని కేంద్ర సర్కార్(Central Govt) నిర్ణయించింది. ఇక మీదట అత్యవసర సేవలకు డయల్‌ 100 కాకుండా 112 నెంబర్‌కు కాల్‌ చేస్తే సరిపోతుంది. దేశవ్యాప్తంగా కొత్త అత్యవసర నెంబర్‌ని ప్రభుత్వం విడుదల చేసింది. దాన్ని తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) అమల్లోకి తీసుకొచ్చింది. ఇక మీదట అత్యవసర సేవల కోసం 112 నెంబర్‌కి కాల్ చేస్తే అన్ని రకాల సేవలు లభిస్తాయని చెప్పింది. ఇది వరకు వేర్వేరు సేవకలకు గాను వేర్వేరు నెంబర్లు ఉండేవి. Police 100, Fire 101, మెడికల్ 109, చైల్డ్ 1098 ఇలా అవసరాన్ని బట్టి ఆయా నెంబర్లకు ఫోన్‌ చేయాల్సి వచ్చేంది. అయితే ఇక మీదట అన్ని సేవలకు గాను ఒకే అత్యవసర నెంబర్ కింద ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Verify: Can you dial 112 to let police know you're not pulling over right  away? | wzzm13.com

GPS ద్వారా ట్రాక్ చేసి వెంటనే సాయమందిస్తారు..

దీంతో, ఇకమీదట అన్ని అత్యవసర సేవల కోసం 112 డయల్ చేస్తే GPS ద్వారా ట్రాక్ చేసి వెంటనే సంఘటన స్థలానికి అధికారులను పంపించేలా కొత్తగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దీన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ సేవల(Service)ను అందరూ వినియోగించుకోవాలని అధికారులు కోరారు. దీన్ని ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్(Command Control Room)లో ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఒకటి, రెండు నెలల్లో డయల్‌ 112పై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు తెలంగాణ పోలీస్‌ శాఖ(Telangana Police Department) కార్యాచరణ సిద్ధం చేసింది. US, యూరప్‌లోని చాలా దేశాల్లో ఒకే నెంబర్ అమల్లో ఉంది. అదే తరహాలో భారత్‌(India)లోనూ అమలు చేయనున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *