Court Movie: దూసుకెళ్తోన్న ‘కోర్ట్’.. ఓవర్సీస్‌లోనూ రికార్డ్ స్థాయి కలెక్షన్స్

నేచురల్ స్టార్ నాని(Nani) నిర్మాణంలో రామ్ జగదీశ్(Ram Jagadish) డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘కోర్ట్(Court: State vs a Nobody)’ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లు(Collections) కొల్లగొడుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో రూ.50 కోట్లకి పైగా వసూలు చేసిన ఈ చిత్రం ఓవర్సీస్‌లోనూ దూసుకెళ్తోంది. US గడ్డపై $1 మిలియన్ మార్క్‌ను క్రాస్ చేసినట్లు మేకర్స్ ట్వీట్ చేశారు. కంటెట్ ఉన్న సినిమాలను ప్రజలు ఆదరిస్తారని మరోసారి నిరూపితమైందని పేర్కొన్నారు. OTT రిలీజ్‌కు కాస్త టైమ్ పట్టొచ్చని సినీవర్గాలు తెలిపాయి. ప్రియదర్శి(Priyadarshi), హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ(Shivaji) ప్రధాన పాత్రలను పోషించిన ఈ సినిమా ఈనెల 14న థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే.

‘కోర్ట్’ కథేంటంటే..

2013లో వైజాగ్ నేపథ్యంలో జరిగే కథ ఇది. భర్తను కోల్పోయిన సీతారత్నం (Rohini) తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుంది. ఇంటర్ చదువుతున్న ఆమె కూతురు జాబిలి (Sridevi), చందూ (Harsh Roshan)ను ఆటపట్టించబోయి అతని ప్రేమలో పడుతుంది. చందూ ఓ పేద కుటుంబానికి చెందిన కుర్రాడు. ఇంటర్ ఫెయిల్ కావడం వలన చిన్నా చితకా పనులు చేస్తూ ఉంటాడు. తాము అనుకున్నట్టుగా అతను చదవలేకపోవడం గురించి తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. డబ్బుకీ .. పరువుకు ఎక్కువగా మంగపతి (శివాజీ) ప్రాధాన్యతనిచ్చే వ్యకి అతను. తన పరువును కాపాడుకునే క్రమంలో తన వాళ్లందరినీ భయపెట్టేస్తూ ఉంటాడు.

Court Movie Review: Court Room Drama

పరువు, పలుకుబడికి మధ్య ఆసక్తికర పోరాటం

ఇక చందూతో జాబిల్లి లవ్‌లో పడిందని తెలిసిన అతను కోపంతో ఊగిపోతాడు. జాబిల్లిని మైనర్ గా పేర్కొంటూ, తన పలుకుబడిని ఉపయోగించి చందూపై ‘పోక్సో’ చట్టంతో పాటు ఇతర సెక్షన్లపై కూడా కేసు పెడతాడు. మోహన్ రావు (సాయికుమార్) దగ్గర జూనియర్ లాయర్ గా పనిచేసే సూర్యతేజ (ప్రియదర్శి)కి ఈ కేసులో చందూకి అన్యాయం జరుగుతుందని భావించి రంగంలోకి దిగుతాడు. చందు నిర్దోషి అని అతను నిరూపించగలుగుతాడా? డబ్బు, పలుకుబడి ఉన్న మంగపతి నెగ్గుతాడా? అనేది తెరపై చూడాల్సిందే.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *