Mufasa:The Lion King: ఓటీటీలోకొచ్చిన ముఫాసా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

హాలీవుడ్(Hollywood) బ్లాక్ బ‌స్ట‌ర్ ‘ముఫాసా: ది లయన్‌ కింగ్ (Mufasa The Lion King)’ డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ‘ది లయన్ కింగ్(he Lion King)’ సినిమాకు ప్రీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం ఇండియాలోనే దాదాపు రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టింది. చిన్న పిల్లలతోపాటు పెద్ద వాళ్లను కూడా ఈ సినిమా ఆకట్టుకుంది. కాగా దాదాపు మూడు నెలల తర్వాత ఈరోజు(మార్చి 26) ఈ సినిమా OTTలోకి వచ్చేసింది. ఈ మేరకు ‘ముఫాసా: ది లయన్‌ కింగ్’ (Mufasa The Lion King Ott News) ఓటీటీలోకి వచ్చేసిందని మేకర్స్ పోస్ట్ చేశారు. ప్ర‌ముఖ OTT వేదిక జియో హాట్‌స్టార్‌లో తెలుగుతో పాటు ఇంగ్లిష్, హిందీ, త‌మిళం భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

Mufasa: The Lion King' ending explained: Why Simba's evil uncle was named  Scar? - Entertainment

‘ముఫాసా’కు మహేశ్ బాబు డబ్బింగ్

చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరినీ ‍అలరించిన చిత్రం ‘ది లయన్‌ కింగ్‌(he Lion King)’. ఈ చిత్రంలో రాజ్యాన్ని పాలించే ముఫాసా, అతని తమ్ముడు స్కార్ పాత్రలు అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇక ఈ సినిమాకి తెలుగులో ముఫాసా అనే రాజు పాత్ర‌కు మ‌హేశ్ బాబు (Mahesh Babu) డ‌బ్బింగ్ చెప్ప‌ారు. ఈ డబ్బింగ్ తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మరోవైపు హిందీ వెర్ష‌న్‌కు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) డ‌బ్బింగ్ చెప్పాడు. ముఫాసా కొడుకు పాత్ర అయిన సింబా పాత్ర‌కు షారుఖ్ కొడుకు ఆర్య‌న్ ఖాన్(Aaryan Khan) తన గాత్రం అందించాడు.

Mufasa: The Lion King OTT Release Date, Platform, and Everything

మొదటి వారంలోనే భారీ కలెక్షన్స్‌

అయితే గతేడాది లయన్‌ కింగ్‌ ప్రీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. ఈ సినిమాను అకాడమీ అవార్డ్ విజేత, దర్శకుడు బారీ జెంకిన్స్ తెరకెక్కించారు. గతేడాది డిసెంబరు 20న విడుదలైన ఈ సినిమా మొదటి వారంలో భారీ కలెక్షన్స్‌ రాబట్టింది. ముఫాసా ఎదగడానికి చేసిన ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూపించారు. ఇంకెందుకు ఆలస్యం పిల్లలతో కలిసి మీరూ ‘ముఫాసా’ పోరాటాన్ని చూసేయండి.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *