CP Radhakrishnan: వైస్ ప్రెసిడెంట్ పదవికి నామినేషన్ వేసిన సీపీ రాధాకృష్ణన్

ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. అధికార NDA కూటమి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్(CP Radhakrishnan) బుధవారం తన నామినేషన్(Nomonation) పత్రాలను దాఖలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi), పలువురు కేంద్ర మంత్రుల సమక్షంలో ఆయన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి(Returning Officer)కి సమర్పించారు. ఈ కార్యక్రమం ఎన్డీఏ కూటమి ఐక్యతను, బలాన్ని ప్రదర్శించేలా సాగింది.

హాజరైన NDA కూటమి అగ్రనేతలు

రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేసే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Home Minister Amit Shah), రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh), బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా(JP Nadda), రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వంటి అగ్రనేతలు ఆయన వెంట ఉన్నారు. కూటమిలోని కీలక నేతలంతా హాజరుకావడంతో ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.

సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక

సెప్టెంబర్ 9వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక(Vice President Election) జరగనుంది. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ(Electoral College)లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉంది. ఈ నేపథ్యంలో రాధాకృష్ణన్ విజయం లాంఛనప్రాయమేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సంఖ్యాబలం దృష్ట్యా ఆయన ఎన్నిక ఏకపక్షంగానే జరగనుందని అంచనా వేస్తున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *