Mana Enadu:Dana Cyclone Effect: వాయవ్య బంగాళాఖాతం(Northwest Bay of Bengal)లో ‘దానా’ తుఫాను(Dana Cyclone) అల్లకల్లోలం సృష్టిస్తోంది. గంటకు 12 కిలో మీటర్ల వేగంతో తుఫాన్ కదులుతోంది. పారాదీప్ (Odisha)కు 260 కిలోమీటర్లు, ధమ్రాకు 290 కిలోమీటర్లు, సాగర్ ద్వీపానికి (West Bengal) 350 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీంతో ఈ తుఫాను ఎలాంటి బీభత్సం సృష్టిస్తుందోనని తీర ప్రాంత ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.
12KM వేగంతో తీరం వైపు
ఇప్పటికే APలోని వైజాగ్, శ్రీకాకుళం, ఒడిశాలలోని సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు భారీ ఎత్తున ఎగిసి పడుతున్నాయి. కేంద్ర బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న తుఫాను ఉత్తర, పశ్చిమ దిశగా తీరానికి చేరువవుతోంది. పరదీప్‌కు దక్షిణ తూర్పు దిశలో 460 కిలోమీటర్లు, ధమ్రాకు 490KM, సాగర ద్వీపానికి 540KM దూరంలో ఉన్న ఈ తుఫాన్ గంటకు 12KM వేగంతో తీరం వైపునకు వస్తున్నట్లు IMD చెబుతోంది. తుఫాన్ తీరం దాటే సమయంలో 100-120KM వేగంతో గాలులు వీస్తాయని, 20CMకు మించి వర్షాలు(Rains) కురుస్తాయని చెప్పింది.
51 రైళ్లను రద్దు
తుఫాను ఏ క్షణమైన తీరందాటే అవకాశం ఉందని, ఈ సమయంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా ఉత్తరాంధ్రపై తీవ్ర ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ అధికారులు(Weather officials) తెలిపారు. ఉత్తరాంధ్ర తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని వెల్లడించారు. మరోవైపు దానా తుఫాన్ అలర్ట్ నేపథ్యంలో రైల్వేశాఖ(Department of Railways) అప్రమత్తమైంది. ఇవాళ, రేపు (అక్టోబర్ 25, 26 తేదీల్లో) భువనేశ్వర్, విజయవాడ వైపు వెళ్లే 51 రైళ్ల(Trains)ను రద్దు చేసినట్టు వెల్లడించింది. రైల్వే ప్రయాణికుల కోసం టోల్‌ఫ్రీ 08942- 286 213, 85912 85913 నంబర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
#CycloneDana is inching towards the Odisha coast. Very heavy rain is possible over Odisha and adjoining West Bengal coasts next 24 hours. pic.twitter.com/s9nLtooIyL
— Chennai Weather-Raja Ramasamy (@chennaiweather) October 24, 2024






