మాస్, యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ నందమూరి బాలకృష్ణ. ఆయనను హీరోగా ఎంచుకునే డైరెక్టర్లు సైతం బాలయ్యకు తగ్గట్లుగానే కథను ఎంచుకుంటారు. అందులోనూ కుటుంబ కథ ఆధారంగా మాస్ సస్పెన్స్ థ్రిల్లర్ సన్నివేశాలు పక్కాగా ఉంటాయి. తాజాగా బాలకృష్ణ(Balakrishna)- డైరెక్టర్ బాబీ(Director Bobby) కాంబోలో వచ్చిన చిత్రం ‘డాకు మహారాజ్(Daaku Maharaaj). సంక్రాంతి కానుకగా ఈ మూవీ ఇవాళ (జనవరి 12) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. మరి ‘డాకు’తో బాలయ్యబాబు తన విజయపరంపరను కొనసాగించారా? ఇంజినీర్(Engineer)గా బాలకృష్ణ సక్సెస్ సాధించాడా? మొత్తంగా సంక్రాంతికి ఈ నందమూరి హీరో హిట్టు కొట్టాడా? లేదా? తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదివేయాల్సిందే..
డాకు మహారాజ్ – ఎవరు ఎలా..
Actors: నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశీ రౌటేలా
Music: S తమన్
Photography: విజయ్ కార్తీక్
Art director: అవినాష్ కొల్లా
Composition: నిరంజన్ దేవరమానే, రూబెన్
Director: బాబీ కొల్లి ని
Producers: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
Banners: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్
Submission: శ్రీకర స్టూడియోస్
PRO: లక్ష్మీవేణుగోపాల్
Release date: 12-01-2025(ఆదివారం)
కథేంటంటే..
డాకు మహారాజ్ కథ ఎత్తుగడే భిన్నంగా ఉంటుంది. మదనపల్లె ప్రాంతంలో టీ ఎస్టేట్ ముసుగులో జంతువుల చర్మం, ఏనుగు దంతాలు స్మగ్లింగ్‌తో ఎమ్మెల్యే త్రిమూర్తులు నాయుడు (రవికిషన్), అతని తమ్ముడు మనోహర్ నాయుడు అరాచకాలు చేస్తుంటారు. బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ ఆపద నుంచి గట్టెక్కించడానికి ఆ ఇంట్లో పని చేస్తున్న మకరంద్ దేశపాండే చంబల్‌లోని మోస్ట్ వాంటెడ్ మహారాజ్ (బాలకృష్ణ)కు కబురుపెడతాడు. మహారాజ్ నానాజీగా పేరు మార్చుకొని పాపకి డ్రైవర్‌గా చేరుతాడు. అసలు ఈ మహారాజ్ ఎవరు? ఆ పాపకి తనతో ఉన్న సంబంధం ఏమిటి? ఈ కథతో బల్వంత్ ఠాకూర్ (బాబీ డియోల్) నందిని (శ్రద్ధా శ్రీనాథ్) ఎవరు? అసలు మహారాజ్, నానాజీ గా పేరు మార్చుకొని రావాల్సిన అవసరం ఏమిటి? త్రిమూర్తులు నాయుడు అరాచకాలకు డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు? బేబీ వైష్ణవికి ఎలా అండగా నిలిచాడు? తనకు ఎలాంటి శత్రువులు ఉన్నారు? ఇవన్నీ తెరపై చూడాలి.
బాలయ్య ఎనర్జీ మామూలుగా లేదుగా..
టాలీవుడ్‌లో యాక్షన్ పాత్రలంటే బాలయ్యకి కొట్టినపిండి. డాకు మహారాజ్ కూడా ఆయనకి అలవాటైన పాత్రే. అయితే ఇందులో యాక్షన్ చాలా డిఫరెంట్. అరుపులు కేకలు ఉండవు. చాలా డీసెంట్ స్లీక్ యాక్షన్‌లో బాలయ్యని చూడటం అభిమానులకు కూడా కొత్త అనుభూతి కలిగిస్తుంది. ఆయన క్యారెక్టర్ మేకోవర్, ఎనర్జీ కూడా బాగుంది. ప్రగ్యా జైస్వాల్‌తో పోలిస్తే శ్రద్ధా శ్రీనాథ్‌కి మంచి పాత్ర దక్కింది. బాబీ డియోల్ తన విలనిజంతో అదరగొట్టాడు. ఊర్వశీ రౌటేలా స్పెషల్‌లో దుమ్మురేపింది. ఇక ఈ మూవీకి హైలైట్ తమన్ మ్యూజిక్. ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించే BGM ఉంది. ముఖ్యంగా ఇంటర్వెల్‌కి ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్‌లో బాక్సులు అదిరిపోయేలా ఉంటుంది. అలాగే దాదాపు ఎలివేషన్ సీన్స్ అన్నింటికీ అదిరిపోయే RR ఇచ్చాడు తమన్. అయితే క్లైమాక్స్ పోర్షన్‌ని ఇంకాస్త షార్ఫ్‌గా ఎడిట్ చేస్తే బాగుండేది. మొత్తంగా సంక్రాంతికి బాలయ్య తన మార్క్ ఫర్మార్మెన్స్‌ను చూపించాడనడంలో ఎలాంటి సందేహం లేదు.
రేటింగ్: 2.75/5







