Daaku Maharaaj: ఈనెల 22న ‘డాకు మహారాజ్’ సక్సెస్ మీట్.. ఎక్కడంటే?

నందమూరి నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా బాబీ(Director Bobby) దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘డాకు మహారాజ్(Daaku Mahaaraju)’. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్(Shraddha Srinath), ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela) స్పెషల్ సాంగ్‌తోపాటు కీలక పాత్రలోనూ మెప్పించింది. కాగా మూవీ ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఇదే క్రమంలో రూ.114 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఈ సినిమాతో బాలకృష్ణ కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈనేపథ్యంలో హైదరాబాద్‌లోని ITC కోహినూర్‌లో మూవీ టీమ్ ‘డాకు మహారాజ్‘ సక్సెస్ మీట్(Success Press Meet) నిర్వహించింది.

Image

తల్లిదండ్రుల, కళామతల్లి ఆశీర్వాదంతోనే..

తాజాగా డాకు మహారాజ్(Daaku Mahaaraj) సక్సెస్ ఈవెంట్లో బాలకృష్ణ మాట్లాడారు. జనవరి 22న అనంతపురంలో ‘డాకు మహారాజ్’ విజయోత్సవ పండుగ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. తాను దైవాన్ని నమ్ముతానని.. అలాగే నా తల్లిదండ్రుల ఆశీర్వాదం, కళామతల్లి ఆశీర్వాదం.. ఇవన్నీ కలగలిపితే ఒక డాకు మహారాజ్ అని చెప్పారు. వరుసగా ఇది తనకు నాలుగో విజయమన్నారు. కొవిడ్ సమయంలో సాహసించి అఖండ(Akhanda) సినిమాను విడుదల చేసినట్లు గుర్తు చేశారు. ఆ సినిమా అఖండ విజయం సాధించడమే కాకుండా, ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే ధైర్యాన్ని ఇతర సినిమాలకు కలిగించిందన్నారు. అలాగే ప్రతి సినిమాని ఒక ఛాలెంజ్‌గా తీసుకొని చేస్తానని తెలిపారు.

అతడి పేరు ఇకపై NBK తమన్

చిత్ర బృందానికి తాను కృతజ్ఞతలు తెలిపారు. దీంతో పాటు ఆయన కీలక విషయం వెల్లడించారు. తిరుమల ఘటన నేపథ్యంలో అనంతపురంలో తలపెట్టిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌(Pre release event)ను నిర్వహించలేకపోయామన్నారు. అందుకే జనవరి 22న అనంతపురం(Anantapur)లోనే విజయోత్సవ పండుగను జరుపుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. మంచి సినిమాకి మంచి రివ్యూలు ఇచ్చి ప్రజల్లోకి తీసుకెళ్లిన పాత్రికేయ మిత్రులకు కృతఙ్ఞతలు తెలిపారు. ఇక ఈ మూవీకి మంచి మ్యూజిక్ ఇచ్చిన తమన్‌(Thaman)ను బాలయ్య పొగడ్తల్లో ముంచెత్తారు. తమన్ ఇకపై నందమూరి తమన్ కాదని NBK తమన్ అని కొత్త పేరు పెట్టాడు.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Megastar Chiranjeevi: చిరూని కలిసి మహిళా వీరాభిమాని.. రాఖీ కట్టి తీవ్ర భావోద్వేగం 

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వీరాభిమాని రాజేశ్వరి(Rajeshwari), తన ఆరాధ్య నటుడిని కలిసేందుకు సైకిల్‌(Cycle)పై సుదీర్ఘ ప్రయాణం చేసి హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఈ సంఘటన చిరంజీవిని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాక, అభిమానుల హృదయాలను కూడా కదిలించింది. రాజేశ్వరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *