Mana Enadu : నందమూరి బాలకృష్ణ (Balakrishna) హోస్టుగా ఆహాలో విజయవంతంగా రన్ అవుతున్న టాక్ షో ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకే (Unstoppable With NBK)’. ఇటీవల ఈ షోలో విక్టరీ వెంకటేశ్ సందడి చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఎపిసోడ్-8కి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ లో ‘డాకు మహారాజ్’ మూవీ టీమ్ సందడి చేసింది. బాలయ్య నటించిన డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్ బాబీ కొల్లి, నిర్మాత నాగవంశీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ షోకు గెస్టులుగా వచ్చారు.
నేనే మంచి వాడిని
ఈ సందర్భంగా ‘డాకు మహారాజ్ (Daku Maharaj)’ టీమ్‌తో కలిసి బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌లో హంగామా చేశారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. ఈ పూర్తి ఎపిసోడ్ జనవరి 3వ తేదీన ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ‘మీ ముగ్గురితో పోలిస్తే నేనే మంచి వాడిని’ బాలయ్య అనగా అక్కడంతా నవ్వుల పూలు పూశాయి. ఇక రష్మిక మందన్న పెళ్లి గురించి నాగవంశీ ఓ ఆసక్తికర విషయాన్ని ఈ ఎపిసోడ్ లో షేర్ చేశారు. ఎంతో సరదాగా సాగిన ఈ ప్రోమో (Unstoppable Episode 8 Promo)ను మీరూ ఓసారి చూసేయండి.
జనవరి 12న రిలీజ్
ఇక బాలకృష్ణ హీరోగా నటిస్తున్న డాకు మహారాజ్ చిత్రాన్ని బాబీ (Director Bobby) తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ (Bobby Deol) విలన్ గా కనిపించనున్నాడు. జనవరి 12వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా జనవరి 4వ తేదీన అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఆంధ్రాలోనూ భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు.







