మాంచెస్టర్ టెస్టు(Manchester Test)లో టీమ్ఇండియా(Team India) అద్భుతం చేసింది. ఓటమి కోరల్లో చిక్కుకున్న జట్టును కేఎల్ రాహుల్(KL Rahul), గిల్(Gill), జడేజా(Jadeja), వాషింగ్టన్ సుందర్(Washington Sundar) వీరోచితంగా పోరాడి మ్యాచును డ్రాగా ముగించారు. సున్నాకే రెండు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును వీరు అసాధరణ పోరాటంతో జట్టును ఆదుకున్నారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారీ లీడ్ సాధించి టీమ్ఇండియాకు చెక్ పెట్టాలని భావించిన స్టోక్స్(Stokes) సేన చివరకు డ్రా కోసం వాళ్లంతట వాళ్లే అడుక్కునేలా చేశారు. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న ఇంగ్లండ్ ఈ మ్యాచులో నెగ్గి సిరీస్ పట్టేయాలనుకున్న ఉత్సాహంపై మన బ్యాటర్లు నీళ్లు చల్లారు. దీంతో ఇంగ్లండ్ ప్లేయర్లు బిక్కముఖాలేశారు. మొత్తంగా భారత బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌ల అద్వితీయ సెంచరీలు, కేఎల్ రాహుల్ భారీ హాఫ్ సెంచరీ భారత్‌ను ఓటమి నుంచి కాపాడటంతో టీమ్ఇండియాపై ప్రశంసలు కురుస్తున్నాయి.
సిరీస్ నెగ్గాలనుకున్న ఇంగ్లండ్ ఆశలపై నీళ్లు
మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్(Old Trafford) వేదికగా జరిగిన ఇండియా-ఇంగ్లండ్ నాలుగో టెస్ట్ మ్యాచ్ అద్భుత డ్రాతో ముగిసింది. ఈ మ్యాచులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులు చేసింది. యశస్వీ జైస్వాల్ (58), సాయి సుదర్శన్ (61), కేఎల్ రాహుల్ (46) రాణించగా, రిషభ్ పంత్ (54) గాయంతోనే 54 రన్స్ చేసి ఔటయ్యాడు. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో జో రూట్ (150), బెన్ స్టోక్స్ (141) సెంచరీలతో 669 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ రెండేసి వికెట్లు తీశారు. అనంతరం 311 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. క్రిస్ వోక్స్ తొలి ఓవర్‌లోనే జైస్వాల్, సుదర్శన్‌లను డకౌట్ చేయడంతో భారత్ 0/2తో కష్టాల్లో పడింది. అయితే, కేఎల్ రాహుల్ (90), శుభ్‌మన్ గిల్ (104) 188 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు.
11గంటలు.. 5 సెషన్లకు పైగా బ్యాటింగ్
ఐదో రోజు (జులై 27) రాహుల్, గిల్ అవుటైనప్పటికీ, జడేజా (107*), సుందర్ (101*) 203 పరుగుల అజేయ భాగస్వామ్యంతో మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. ఈ మ్యాచ్‌లో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 11గంటల పాటు 5 సెషన్లలో 755 బాల్స్ ఎదుర్కొని ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. మొత్తం 143 ఓవర్లు బ్యాటింగ్ చేసి 425/4 స్కోరు చేసింది. చివరి గంటలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ డ్రా ప్రతిపాదించినప్పటికీ, జడేజా, సుందర్ తమ సెంచరీలను పూర్తి చేయాలనే ఉద్దేశంతో బ్యాటింగ్ కొనసాగించారు. దీనిపై ఇంగ్లండ్ ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఇరు జట్ల మధ్య కొంత ఉద్రిక్తత నెలకొంది. గిల్ మాట్లాడుతూ, తమ బ్యాట్స్‌మెన్ సెంచరీలు సాధించేందుకు అర్హులని అన్నారు. స్టోక్స్ జడేజా, సుందర్‌ల పట్టుదలను ప్రశంసించారు. ఈ డ్రాతో భారత్ సిరీస్‌లో పోరాట స్ఫూర్తిని చాటింది. ఐదు వికెట్లు తీయడంతోపాటు 141 రన్స్ చేసిన ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్‌కు “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు” దక్కింది. కాగా ఇరుజట్ల మధ్య చివరిదైన ఐదో టెస్ట్ జులై 31 నుంచి ఓవల్‌లో జరగనుంది.
🚨 Manchester Test Ends in Draw as Rain Plays Spoilsport
➡️ The 5th day of the India vs England Test at Manchester ended in a draw due to persistent rain.
➡️ India was in a strong position with key performances from Jadeja, Sundar, Shubman Gill, and KL Rahul.
➡️ Despite an… pic.twitter.com/nJftWcHe3T— The Matrix (@thematrixloop) July 27, 2025






