తెలంగాణలోని ఇంటర్మీడియట్(Intermediate in Telangana) పూర్తైన విద్యార్థులకు అలర్ట్. డిగ్రీ కోర్సు(degree courses)ల్లో చేరాలనుకునే విద్యార్థులు డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (Degree Online Services Telangana) ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల(Registrations) ప్రక్రియ ముగిసింది. ఇక ఇవాళ్టితో వెబ్ ఆప్షన్ల(Web Options) గడువు కూడా ముగియనుంది. ఈనెల 29న తొలి విడత సీట్లను అలాట్ మెంట్ చేయనున్నారు. ఇప్పటి వరకూ 87,863 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని DOST కన్వీనర్, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి(Balakishta Reddy) తెలిపారు.
ఈనెల 30 నుంచి రెండో విడత రిజిస్ట్రేషన్
ఇందులో 78,778 మంది రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారని, 70,005 మంది అప్లికేషన్ ప్రక్రియ(Application process) పూర్తి చేసినట్లు చెప్పారు. వీరిలో 57,719 మంది కాలేజీల్లోని వివిధ కోర్సులకు వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. ఇక రెండో విడత రిజిస్ట్రేషన్(Second phase registration) ప్రక్రియ మే 30 నుంచి జూన్ 6వ తేదీ వరకూ కొనసాగనుందని తెలిపారు. ఇందుకు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.400 చెల్లించాల్సి ఉంటుందని దోస్త్ కన్వీనర్ పేర్కొన్నారు.






