
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly elections) కు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇవాళ (జనవరి 5) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఒకే విడతలో పోలింగ్(Polling) జరగనుంది. అలాగే పోలింగ్ ముగిసే వరకు క్యూలో ఉన్నవారికి ఆ తర్వాత కూడా ఓటేసేందుకు అవకాశం కల్పించారు. మొత్తం 699 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాగా ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 1.56 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కాగా ఈరోజు సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్(Exit polls) విడుదల కానున్నాయి. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
త్రిముఖ పోరు తప్పదా?
ఇదిలా ఉండగా ఈసారి ఢిల్లీలో అధికార ఆప్, BJP, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు(A three-pronged battle) హోరాహోరీగా సాగనుంది. ఢిల్లీలో 58 జనరల్, 12 SC రిజర్వ్ సీట్లు ఉన్నాయి. 83.49 లక్షల మంది పురుషులు.. 71.74 లక్షల మంది మహిళా ఓటర్లు(Women Voters) ఉన్నారు. ఇక 20 నుంచి 29 ఏళ్ల వయసు ఉన్న యువ ఓటర్ల సంఖ్య 25.89 లక్షలు కాగా ఇక 2.08 లక్షల మంది ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయనున్నారు. వికలాంగులు 79,430 మంది ఓటర్లు ఉండగా.. 100 ఏళ్లు దాటిన ఓటర్ల సంఖ్య 830.. 85 ఏళ్ల వయసు దాటిన ఓటర్ల సంఖ్య 1.09 లక్షలుగా ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు. మరోవైపు ఢిల్లీలో ట్రాన్స్‌జెండర్ ఓటర్ల(Transgender voters) సంఖ్య 1261 ఉన్నారు.
కేజ్రీవాల్‌పై కేసు నమోదు
మరోవైపు ఢిల్లీలో పోలింగ్ వేళ మాజీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్Kejriwal) పై హరియాణా పోలీసులు(Haryana Police) కేసు నమోదు చేశారు. యమునా జలాలను హరియాణాలో ఉన్న BJP ప్రభుత్వం విషపూరితం చేస్తోందంటూ కేజ్రీవాల్ ఆరోపించారు. ఇందులో భాగంగా ఆప్ అధినేతపై పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత(Indian Law Code)లోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. అల్లర్లను రెచ్చగొట్టడం, పౌరుల మతపరమైన భావాలను అవమానించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని పోలీసులు తమ తెలిపారు.