ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు 48వ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచులో టాస్ నెగ్గిన ఢిల్లీ(DC) కెప్టెన్ అక్షర్ పటేల్ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచులో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతున్నట్లు అక్షర్ తెలిపాడు. అటు కోల్‌కతా(KKR) మాత్రం ఒక మార్పుతో బరిలోకి దిగింది. అనుకుల్ రాయ్ జట్టులోకి వచ్చాడు. కాగా హోం గ్రౌండ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో మరింత ముందుకెళ్లాలని ఢిల్లీ భావిస్తోంది. మరోవైపు కేకేఆర్ ఇందులో తప్పక నెగ్గాల్సిందే.
రైడర్స్‌దే పైచేయి
ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ 34 మ్యాచ్‌లలో తలపడ్డాయి. ఢిల్లీ క్యాపిటల్స్ 14 మ్యాచ్‌లలో విజయం సాధిస్తే, కోల్‌కతా నైట్ రైడర్స్ 18 మ్యాచ్‌లలో విజయం సాధించాయి. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. ఈ రెండు జట్లు ఆడిన చివరి మ్యాచ్‌లో కోల్‌కతా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో కూడా కేకేఆర్‌దే పైచేయి. ఢిల్లీ నాలుగు గెలవగా, కోల్‌కతా ఐదు విజయాలు సాధించింది. మరి ఈ రోజు జరిగే మ్యాచ్‌లో ఏం మ్యాజిక్ జరుగుతుందో వేచి చూడాలి.
తుది జట్లు ఇవే..
Kolkata Knight Riders: రహ్మానుల్లా గుర్బాజ్ (Wk), సునీల్ నరైన్, అజింక్యా రహానే (C), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రోవ్‌మన్ పావెల్, హర్షిత్ రాణా, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి
Delhi Capitals: ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్(Wk), కరుణ్ నాయర్, KL రాహుల్, అక్షర్ పటేల్(C), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, దుష్మంత చమీరా, ముఖేష్ కుమార్
DC vs KKR Live Streaming, IPL 2025: How To Watch Delhi Capitals vs Kolkata Knight Riders Clash Live In India https://t.co/HuFZ3RNmag via @Axpertmedia #CowboyCarterTour #dcvskkr
— Axpert (@Axpertmedia) April 29, 2025






