
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాన్(Pawan Kalyan) మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. తన పట్ల అపారమైన అభిమానం కలిగిన 96 ఏళ్ల వృద్ధురాలు పోతుల పేరంటాలు(Pothula Perantalu)తో కలిసి ఆయన భోజనం చేసి, ఆమె ఆనందానికి కారణమయ్యారు. పవన్‌కు వీరాభిమాని అయిన ఆ వృద్ధురాలు ఆయనతో భోజనం చేయాలనే ఆమె చిరకాల కోరిక. ఈ విషయం తెలుసుకున్న పవన్ తక్షణమే స్పందించి ఆమెను జనసేన క్యాంపు కార్యాలయాని(Janasena camp office)కి ఆహ్వానించారు. అక్కడ ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, ఆమెతో కలిసి భోజనం(Lunch) చేశారు. అంతేకాకుండా ఆ వృద్ధురాలికి రూ.లక్ష నగదు అందించి, కొత్త చీరను కూడా బహూకరించారు. ఈ వీడియో సోషల్ మీడియా(SM)లో వైరల్ అవుతోంది.
“Only young blood likes Pawan Kalyan” they said.
Show them,
pic.twitter.com/skOBBCUzGw— World PSPK Fans 🦅 (@WorldPSPKFans) May 9, 2025
పవన్ గెలిస్తే పొర్లు దండాలు పెడతానని మొక్కులు
కాకినాడ జిల్లా, కొత్తపల్లి మండలం, కొత్త ఇసుకపల్లి గ్రామానికి చెందిన పోతుల పేరంటాలు 2024 ఎన్నికలలో పవన్ పిఠాపురం నియోజకవర్గం(Pithapuram Constituency) నుంచి గెలిస్తే వేగులమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి, పొర్లు దండాలు సమర్పిస్తానని మొక్కుకున్నారు. ఆ కోరిక నెరవేరడంతో తన ఫించను డబ్బులతో అమ్మవారికి వెండి గరగ చేయించి సమర్పించి, ఇతర మొక్కులు చెల్లించారు. ఈ విషయం పవన్ దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు.