సలేశ్వరం జాతర(Saleswaram Jathara)కు భక్తులు పోటెత్తడంతో శ్రీశైలం(Srisailam) రహదారిపై 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్(Traffic jam) అయింది. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలోని సలేశ్వరంలో ఏటా చైత్ర పౌర్ణమి సందర్భంగా మూడు రోజులపాటు లింగమయ్య స్వామి జాతర(Linganmayya Swami Jathara) నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారు. వరుస సెలవుల నేపథ్యంలో శ్రీశైలానికి కూడా భక్తులు(Devotees) పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో శ్రీశైలం ప్రధాన రహదారి రద్దీగా మారింది.

మన్ననూరు చెక్‌పోస్ట్(Munnur Checkpost) వద్ద సలేశ్వరం వెళ్లే వాహనాలు టోల్ రుసుము(Toll) చెల్లించే క్రమంలో ఆలస్యం అవుతుండటంతో రహదారిపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఆరు కిలోమీటర్ల మేర సిద్ధాపూర్ క్రాస్ వరకు రద్దీ నెలకొంది. దీంతో ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది.
సలేశ్వరం క్షేత్రం ఎక్కడుందంటే..
కాగా శ్రీశైలం-హైదరాబాద్(Srisailam-Hyderabad) రహదారిలో ఫరహాబాద్ పులిబొమ్మ నుంచి లోపలికి వెళ్లాలి. 35KM దూరంలో దట్టమైన అడవుల్లో సలేశ్వరం క్షేత్రం(Saleshwara Khsetram) ఉంటుంది. పది కిలోమీటర్ల దూరం వెళ్లగా నే రోడ్డు పక్కన నిజాం కాలం నాటి పురాతన కట్టడం ఉంటుంది. అయితే, లింగాలలోని కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పెద్దతేరును భక్తులు దర్శించుకొని లింగాల నుంచి వయా అప్పాయిపల్లి మీదుగా గోర్జా గుండాల వరకు వాహనాల ద్వారా.. అక్కడ నుంచి 15 కిలోమీటర్లు కాలినడకన సలేశ్వరానికి భారీ సంఖ్యలో తరలివెళ్తుంటారు.
Yesterday #Saleshwaram was crowded with devotees. If you’re planning to visit, please plan accordingly. I’d suggest avoiding taking kids along, if possible. https://t.co/QckyDl4udO pic.twitter.com/TWHB1i9Wqo
— Rudra🚩 (@Mee_Rudra) April 13, 2025






