కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ (Dhanush), మన్మథుడు నాగార్జున కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘కుబేర (Kubera)’. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు కుబేర టైటిల్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. జూన్ 20వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
కుబేర్ రిలీజ్ డేట్
ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఓ క్రేజీ పోస్టర్ ను వదిలారు. ఈ పోస్టర్ లో నాగార్జున (Nagarjuna), ధనుశ్ ఎదురెదురుగా చాలా ఇంటెన్స్ లుక్ లో కనిపించారు. ఇక వీరి మధ్య జిమ్ షరఫ్ సూటు ధరించి పోస్టర్ లో కనిపించాడు. భిన్నమైన సోషల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో ధనుశ్ మునుపెన్నడూ చేయని కొత్త పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇందులో నాగార్జున ఈడీ అధికారి (ED Officer) పాత్ర పోషిస్తున్నట్లు టాక్.
A story of power..👑
A battle for wealth..💰
A game of fate..♟️#SekharKammulasKuberaa is ready to deliver an enchanting theatrical experience from 𝟐𝟎𝐭𝐡 𝐉𝐮𝐧𝐞, 𝟐𝟎𝟐𝟓. pic.twitter.com/EuH5cEppYr— Kubera Movie (@KuberaTheMovie) February 27, 2025
హిట్ గర్ల్ రష్మిక
ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ భామ ఇటీవల నటించిన సినిమాలన్నీ (యానిమల్, పుష్ప-2, ఛావా) బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా కూడా హిట్ అవ్వడం పక్కా అని నెటిజన్లు అంటున్నారు. ఇక ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వం వహిస్తుండటంతో దీనిపై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి.






