
జాతిరత్నాలు, ప్రిన్స్ (Prince) సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని నవ్వడమే మరిచిపోయిన ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు డైరెక్టర్ అనుదీప్ కేవీ (Anudeep KV). ఇప్పుడు ఆయన విశ్వక్ సేన్ (Vishwak Sen)తో ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ‘ఫంకీ’ (Funky) అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో డ్రాగన్ ఫేం కయదు లోహర్ (Kayadu Lohar) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ భామ ఇటీవలే ఎంటర్ ది డ్రాగన్ అనే సినిమాతో సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఈ భామ పర్ఫామెన్స్ చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు.
View this post on Instagram
కయదు రీ ఎంట్రీ
ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘డ్రాగన్ (Dragon)’ సినిమాలో నటించిన కయదు లోహర్ కు తెలుగులోనూ మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడు కుర్రాళ్లంతా నెట్టింట ఈ భామ గురించే వెతుకుతున్నారు. ఇక ఈ బ్యూటీకి టాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నాయి. మూడేళ్ల క్రితమే కయదు శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘అల్లూరి (Alluri)’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ఈ భామకు గుర్తింపు రాలేదు. కానీ ఇప్పుడు తమిళ్ మూవీ డ్రాగన్ తెలుగులో డబ్ అయి రిలీజ్ కావడం.. ఈ సినిమా హిట్ కావడంతో ఈ బ్యూటీ పాపులర్ అయింది.
View this post on Instagram
ఫంకీలో కయదు లోహర్
ఈ నేపథ్యంలోనే తాజాగా విశ్వక్ సేన్ సినిమాలో హీరోయిన్ (Kayadu Lohar Telugu Movie) గా ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా గురించి కయదు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. నేను తెలుగు నేర్చుకుంటున్నాను, త్వరలో తెలుగు సినిమాతో మీ ముందుకు రాబోతున్నాను. త్వరలో టాలీవుడ్‌కి తిరిగి వస్తున్నాను. వెండి తెరపై నన్ను చూసి ఆదరిస్తున్న వారికి ధన్యవాదాలు చెబుతూ పోస్టులో రాసుకొచ్చింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కయదు తెలుగు ఫ్యాన్స్‌కి తాను టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా మెసేజ్ ఇచ్చింది.
View this post on Instagram