
నందమూరి బాలకృష్ణ (Balakrishna) తనయుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) ఎప్పుడెప్పుడు టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తాడా అని నందమూరి ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అప్పుడు.. ఇప్పుడు అంటూ మోక్షు అరంగేట్రంపై వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక హను-మాన్ ఫేం ప్రశాంత్ వర్మ (Prashant Varma) దర్శకత్వంలోనే ఈ వారసుడి ఎంట్రీ ప్లాన్ కూడా చేశారు. సినిమా అనౌన్స్ కూడా చేసి పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక పూజా కార్యక్రమం చేసి సినిమా షూటింగ్ ప్రారంభించడమే తరువాయి అనుకున్నారు. పూజా కార్యక్రమం చేయాలనుకునేలోగానే ఈ సినిమా ఆగిపోయినట్లు వార్తలొచ్చాయి.
మోక్షజ్ఞ ఎంట్రీకి బ్రేక్
ప్రశాంత్ వర్మ-మోక్షజ్ఞ సినిమా (Mokshagna Movie)కు బ్రేక్ పడినట్లు తొలుత వార్తలొచ్చినా.. ఇప్పుడు ఆ సినిమా ఆగిపోయినట్లు న్యూస్ వైరల్ అవుతోంది. అయితే దీనకిి కారణం డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మనసు మార్చుకోవడమేననే టాక్ వినిపిస్తోంది. సినిమా కథ వరకు ఓకే కానీ డైరెక్షన్ తన వల్ల కాదని వర్మ చేతులెత్తేసినట్టు సమాచారం. దీనిపై అసలు క్లారిటీ లేదు కానీ ప్రశాంత్ వర్మ ప్రస్తుతం రిషభ్ శెట్టితో ‘జై హనుమాన్ (Jai Hanuman)’ చిత్రంతో బిజీగా ఉండటం వల్ల మోక్షజ్ఞతో మూవీ ఆగిపోయినట్లు కన్ఫామ్ అయ్యారు నెటిజన్లు.
వారసుడికి హ్యాండ్ ఇచ్చిన డైరెక్టర్
అయితే మోక్షుతో ప్రాజెక్టుకో ప్రశాంత్ వర్మ నో చెప్పడానికి రీజన్ ప్రభాస్ (Prabhas) అని సమాచారం. డార్లింగ్ కోసం ఈ యంగ్ డైరెక్టర్ ఓ సూపర్ స్టోరీని రెడీ చేశాడట. దానికి ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ నేపథ్యంలోనే డార్లింగ్ తో సినిమా కోసం మోక్షజ్ఞ చిత్రానికి వర్మ నో చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే నందమూరి వారసుడి మొదటి సినిమాకే ఇలా జరగడంతో అభిమానులు చాలా నిరాశ చెందుతున్నారు. ముందు కమిట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత తూచ్ అనడం ఏంటని ప్రశాంత్ వర్మపై నెటిజ్లు ఫైర్ అవుతున్నారు.