
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR), సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashant Neel) కాంబోలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ‘డ్రాగన్’ అనే టైటిల్ ఈ చిత్రానికి ప్రచారంలో ఉంది. కేజీయఫ్, కేజీయఫ్-2, సలార్ చిత్రాల తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కోసం ఇటు ప్రశాంత్ ఫ్యాన్స్.. అటు ఎన్టీఆర్ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా గురించి అప్డేట్ వస్తుందా అని చూస్తున్నారు.
The Journey of #NTRNeel begins 💥💥
Get ready for a MASSACRE 💣💥 @NTRNeelFilm 💣 pic.twitter.com/dVElJqtwql
— Prashanth Neel – The Director (@NeelOfficialFc) February 20, 2025
లొకేషన్ హంట్ లో ప్రశాంత్ నీల్
ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు సమాచారం. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ (Ramoji Film City)లో మొదలైంది. ఈ చిత్రానికి సంబంధించి అల్లర్లు, రాస్తారోకో సీన్స్ షూటింగ్ ను ఫిలిం సిటీలో చేశారు. ఇక ఈ చిత్రంలో షిప్పింగ్ వంటి సీన్స్ కోసం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ లొకేషన్ హంట్ మొదలు పెట్టాడు.
#PrasanthNeel Shoot start cheyaka mundhu Visit Chesina Location Kakinada, Uppada Beach🔥@tarak9999 anna scenes max undavu anukunta
Movie Ramp anthey KGF1 ramge movie padithay matram 🔥🔥💥💫
#NTRNeel pic.twitter.com/MXShnVT0W8
— Mani🔥 #Devara (@ManiNTR1999) February 26, 2025
నీల్ సినిమా సెట్ లో ఎన్టీఆర్
ఇందుకోసం ప్రశాంత్ నీల్.. కాకినాడ సమీపంలోని ఉప్పాడ బీచ్ (Uppada Beach), పరిసర ప్రాంతాలను పరిశీలించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కోసం పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతా కు చిత్రబృందం వెళ్లనుంది. 1960లోని వెస్ట్ బెంగాల్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. మార్చి 30న ఎన్టీఆర్ ఈ సినిమా షూట్ కోసం సెట్ లో అడుగుపెట్టబోతున్నారట.