
టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi) కాంబోలో వచ్చిన మరో మూవీ ‘తండేల్ (Thandel)’. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 7వ తేదీ థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీవాసు నిర్మించిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో పాటు బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ రాబట్టింది.
ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ
ఇందులో నాగచైతన్య నటనకు, సాయిపల్లవి మెస్మరైజింగ్ పర్ఫామెన్స్ కు ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడా ఫిదా అయ్యారు. సినిమా రిలీజ్ అయిన మొదటి వారానికే వంద కోట్ల గ్రాస్ మార్క్ ను దాటింది. ఇక థియేటర్లలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న తండేల్ మూవీ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ పైకి వచ్చేందుకు రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను దక్కించుకుంది.
మార్చి 7న తండేల్ స్ట్రీమింగ్
నాగ చైతన్య కెరీర్ లోనే భారీ ధరకు ‘తండేల్ (Thandel Ott Release Date)’ డిజిటల్ రైట్స్ అమ్ముడు పోయినట్లు సమాచారం. థియేటర్ లో రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలోనే తండేల్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయినట్టు తెలిసింది. మార్చి 7వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో తండేల్ మూవీ స్ట్రీమింగ్ కానుంది. త్వరలోనే ఈ సంస్థ అధికారికంగా డేట్ ను ప్రకటించనుంది.